AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జపాన్ లోని అత్యంత వృద్ధురాలు.. దీర్ఘాయుస్సు, ఆరోగ్య రహస్యాన్ని చెప్పిన 114 ఏళ్ల బామ్మ

మనిషి ఆరోగ్యంగా దీర్ఘాయుస్సుతో జీవించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే నేటి సమాజంలో వివిధ కారణాలతో వయసుతో సంబంధం లేకుండా వ్యాధుల బారిన పడుతున్నారు. చిన్న వయసులోనే మృత్యుబారిన పడుతున్నారు. అయితే జపాన్ దేశంలోని ఒక బామ్మ అత్యంత వృద్ధురాలిగా గుర్తింపు పొందింది. ఆ బామ్మ తన దీర్ఘాయువుకి రహస్యం ఏమిటో చెప్పింది.

జపాన్ లోని అత్యంత వృద్ధురాలు.. దీర్ఘాయుస్సు, ఆరోగ్య రహస్యాన్ని చెప్పిన 114 ఏళ్ల బామ్మ
114 Year Old Shigeko Kagawa
Surya Kala
|

Updated on: Aug 06, 2025 | 4:06 PM

Share

కగావా స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని గడిపారు. 2021లో, 109 సంవత్సరాల వయస్సులో, టోక్యో క్రీడల రిలేలో ఒలింపిక్ జ్యోతిని మోసిన అతి పెద్ద వయసు వ్యక్తులలో ఆమె ఒకరు. వైద్యురాలిగా ఆమె జీవితం, రోగులకు అంకితభావం మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి ఆమెను జపాన్‌లో దీర్ఘాయువు చిహ్నంగా మార్చాయి.

సూపర్ సెంటెనరియన్లకు ప్రసిద్ధి చెందిన జపాన్..తమ దేశంలో కొత్త వృద్ధురాలిని కనుగొంది. ఆ దేశంలో అత్యంత వృద్ద మనిషి 114 ఏళ్ల మియోకో హిరోయాసు ఇటీవల మరణించిన తర్వాత జపాన్ ఆరోగ్య, కార్మిక, సంక్షేమ మంత్రిత్వ శాఖ తమ దేశంలో అత్యంత వృద్ధ మనిషి ఎవరో ప్రకటన చేసింది. జపాన్‌లో జీవించి ఉన్న అత్యంత వృద్ధ వ్యక్తిగా 114 సంవత్సరాల షిగేకో కగావా నిలిచినట్లు అధికారికంగా వెల్లడించింది. ఆమె రిటైర్డ్ వైద్యురాలు. ఈ రోజు షిగెకో కగావా దీర్ఘాయువు రహస్యం ఏమిటి? తెలుసుకుందాం..

తొలినాళ్ళ జీవితం

షిగెకో కగావా 1911 మే 28న జన్మించారు. జపాన్ తీవ్ర మార్పులు జరుగుతున్న కాలంలో.. ఒసాకా ఉమెన్స్ మెడికల్ కాలేజీ (ఇప్పుడు కాన్సాయ్ మెడికల్ యూనివర్సిటీ)లో తన చదువు పూర్తి చేశారు. మహిళా వైద్యులు కొరతగా ఉన్న ఆ సమయంలో వైద్య వృత్తిని చేపట్టారు. ఆమె జీవిత అనుభవం సవాళ్లు, ఆశావాదం రెండింటినీ కలగలిపి సాగింది. సమాజానికి సేవ చేయడమే కాదు, ఇతరులకు ఆరోగ్య సంరక్షణను ఎంతో అంకిత భావంతో అందించారు.

ఇవి కూడా చదవండి

వైద్యురాలిగా కెరీర్

కగావా తన ఇరవైలలో డాక్టర్ గా ప్రాక్టీసును ప్రారంభించారు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఒసాకాలోని ఆసుపత్రి సిబ్బందిలో చేరారు. వైమానిక దాడుల వలన ఆమె స్వస్థలం పూర్తిగా నాశనం అయింది. అనేక మంది మరణించారు. ఈ సంఘటన ఆమెకు ఎంతో బాధని కలిగించింది. యుద్ధం తర్వాత ఆమె తన క్లినిక్‌ను నిర్వహించుకుంటూనే.. ప్రసూతి వైద్యురాలిగా, గైనకాలజిస్ట్‌గా విధులు నిర్వర్తించింది. ఎప్పుడు ఎవరికీ వైద్య సాయం కావాలన్నా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేది. రాత్రి పగలు అనే తేడా లేకుండా గర్భిణీ స్త్రీలకూ సహాయం చేసేవారు. చివరికి ఆమె తన 86 సంవత్సరాల వయస్సులో పదవీ విరమణ చేశారు.

క్రియాశీల పదవీ విరమణ

కగావా పదవీ విరమణ తర్వాత కూడా ఏదోకపని చేయాలనీ భావించారు. కగావా స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని గడిపారు. 2021లో, 109 సంవత్సరాల వయస్సులో టోక్యో క్రీడల రిలేలో ఒలింపిక్ జ్యోతిని మోసిన అతి పెద్ద వయసు వ్యక్తులలో ఆమె ఒకరు. వైద్యురాలిగా ఆమె జీవితం, రోగులకు అంకితభావం, ఆరోగ్యకరమైన జీవనశైలి ఆమెను జపాన్‌లో దీర్ఘాయువుకి చిహ్నంగా మార్చాయి.

కగావా పదవీ విరమణ చేసిన తర్వాత యమటోకోరియామా నారా ప్రిఫెక్చర్‌లో తన కుటుంబంతో నివసించాలని ఎంచుకుంది. ఇప్పటికీ, కగావా మానసికంగా చురుకుగా ఉంది. ఆమె వార్తల గురించి తెలుసుకోవడానికి ప్రతిరోజూ భూతద్దం ఉపయోగించి వార్తాపత్రిక చదువుతుంది. అలాగే కాలిగ్రఫీని అభ్యసించడం, వారానికి రెండు రోజులు డేకేర్‌లో గడపడం వంటి ప్రామాణిక షెడ్యూల్‌ను అనుసరిస్తుంది. ఆమె రోజువారీ దినచర్యలో మనస్సును చురుకుగా ఉంచుకుంటుంది.

ఆమె దీర్ఘాయువు రహస్యం సరళమైన, స్థిరమైన జీవితం

కగావా ఆరోగ్యంగా ఉండటానికి అసాధారణంగా ఏమీ చేయలేదని ఆమె కుటుంబం చెబుతోంది. ఆమె ఒక నిర్దిష్టమైన దినచర్యను అనుసరిస్తుంది. చిన్న చిన్నగా రోజులో మూడుసార్లు భోజనం తింటుంది. విశ్రాంతి, సమతుల్యతను విలువైనదిగా భావిస్తుంది.

గతంలో ఆమె దీర్ఘాయుష్షు గురించి ఎవరైనా అడిగితే “నేను డాక్టర్‌గా ఉన్నప్పుడు ఇప్పుడున్నట్లుగా కార్లు ఉండేవి కావు. కనుక తాను పేషెంట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు క్లాగ్స్ వేసుకుని చాలా దూరం నడిచేదానిని. బహుశా అందుకే నేను బలంగా, ఆరోగ్యంగా ఉన్నాను ఏమో అంటూ చెబుతుంది. నా శక్తి నా గొప్ప ఆస్తి. నాకు ఇష్టమైన ఆహారాన్ని తింటూ, నాకు ఇష్టమైన కార్యకలాపాలను కొనసాగిస్తూ నేను ఎక్కడికైనా వెళ్తాను. నేను స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఉన్నానని చెప్పింది. అదే సమయంలో వృద్ధులు తమ మనస్సుని చురుకుగా ఉంచుకుంటూ, తాజా అనుభవాల కోసం మనసుని తెరిచి ఉంచుకోవాలని చెబుతుంది.

సమాజం, కుటుంబం

ఆమె కుటుంబ సభ్యుల ప్రేమ కగావా ఆనందానికి పునాది. ఇంటి సభ్యుల మద్దతు, మాజీ రోగులతో ఆమెకున్న స్నేహం, ఆమె ప్రస్తుత సామాజిక నెట్‌వర్క్ కలయిక ద్వారా ఆమె నిరంతర ఆనందాన్ని పొందుతుంది. సమాజానికి ఆమె అంకితభావంతో చేసిన సేవకు అధికారిక గుర్తింపు లభిస్తుంది. ఆమె అత్యుత్తమ జీవిత విజయాలను గుర్తిస్తూ స్థానిక అధికారులు సత్కరించారు. చాలా మంది ఆమె కథలో ప్రేరణ పొందుతారు, ఇది వయస్సుతో సంబంధం లేకుండా ప్రస్తుత క్షణాల్లో విలువను కనుగొనమని ప్రతి ఒక్కరినీ ప్రోత్సహిస్తుంది.

జపాన్ దేశం దీర్ఘాయువుకు ప్రసిద్ధి చెందింది. దేశ మొత్తం జనాభాలో 29% మంది 65 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న 36 మిలియన్ల మంది ఉన్నారు. అయితే సెప్టెంబర్ 2024 నాటికి దేశంలో 95,119 మంది 100 ఏళ్లు నిండిన వారు ఉన్నారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..