వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత వైఎస్ షర్మిల మరోసారి అరెస్టయ్యారు. పంజాగుట్ట సమీపంలో వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం ఉదయం పోలీసుల కళ్లుగప్పి హైదరాబాద్ లోటస్ పాండ్ బయటకు వెళ్లిపోయారు. లోటస్ పాండ్ నుంచి ప్రగతి భవన్ వైపునకు వెళ్లినట్టుగా పోలీసులు అనుమానించారు. పోలీసులకు కళ్లు గప్పి ఇంటి నుంచి బయటకు వచ్చిన వైయస్ షర్మిల… ప్రగతి భవన్‌ను ముట్టడించేందుకు వెళ్లారు. ఇందులో భాగంగా పంజాగుట్ట సర్కిల్ దాటి ప్రగతి భవన్ వైపునకు వెళ్తుండగా పోలీసులు గుర్తించారు. అయితే నిన్న దాడిలో ధ్వంసమైన కారును నడుపుకుంటూ.. ప్రగతి భవన్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన వైఎస్ షర్మిల ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు.
షర్మిలాను అడ్డుకోవడంతో పలు కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. దీంతో వైఎస్ షర్మిలను పంజాగుట్ట పరిధిలో అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమె పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఉన్నట్లు సమాచారం అందుతుంది.
నర్సంపేటలో సోమవారం మధ్యాహ్నం వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. నర్సంపేట నుంచి హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. బుధవారం మహబూబాబాద్‌లో షర్మిల టూర్ జరగనుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం