Telangana: పాదయాత్రకు పర్మిషన్ నిరాకరణ.. ఆమరణ నిరాహార దీక్షకు దిగిన వైఎస్ షర్మిల..

నా పాదయాత్ర నన్ను చేసుకోనివ్వరా.. హైకోర్టు వరమిచ్చినా ఈ పూజారి మాత్రం అడ్డు తగులుతున్నారెందుకు.. అంటూ కేసీఆర్ టార్గెట్‌గా యుద్ధం కంటిన్యూ చేస్తున్నారు షర్మిల. తెలంగాణాలో నయా ఫైర్‌బ్రాండ్‌గా ఎమర్జ్ అవుతున్న షర్మిల..

Telangana: పాదయాత్రకు పర్మిషన్ నిరాకరణ.. ఆమరణ నిరాహార దీక్షకు దిగిన వైఎస్ షర్మిల..
Ys Sharmila

Updated on: Dec 10, 2022 | 10:01 AM

నా పాదయాత్ర నన్ను చేసుకోనివ్వరా.. హైకోర్టు వరమిచ్చినా ఈ పూజారి మాత్రం అడ్డు తగులుతున్నారెందుకు.. అంటూ కేసీఆర్ టార్గెట్‌గా యుద్ధం కంటిన్యూ చేస్తున్నారు షర్మిల. తెలంగాణాలో నయా ఫైర్‌బ్రాండ్‌గా ఎమర్జ్ అవుతున్న షర్మిల.. ఆ దూకుడును ఇంచయినా తగ్గించడం లేదు. నిన్న పొద్దున మొదలైన షర్మిల మార్కు గడబిడ.. ఇవాళ కూడా కంటిన్యూ అవుతోంది.

తాను చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించి వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. అన్నంత పని చేశారు. ఇవాళ ఉదయం నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు షర్మిల. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తునందుకే తన పాదయాత్రకు అనుమతి ఇవ్వడంలేదని ఆరోపించారు. పాదయాత్రకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే యాత్రను అడ్డుకున్నారన్నారని వైఎస్ షర్మిల అన్నారు. నిన్న ప్రజా ప్రస్థాన పాదయాత్రకు అనుమతి నిరాకరించడంపై షర్మిల నిరసన వ్యక్తం చేస్తూ ట్యాంక్ బండ్ పై అంబేద్కర్ విగ్రహం ముందు ఆమె దీక్షకు దిగిన విషయం తెలిసిందే. దాంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేసి లోటస్ పాండ్ కు తరలించారు. లోటస్ పాండ్ వద్ద నిరవధిక దీక్ష చేపట్టిన వైఎస్ షర్మిల వద్దకు అర్ధరాత్రి సమయంలో పార్టీ మద్దతుదారుడు పెట్రోల్ బాటిల్ తో హల్చల్ చేసాడు. వైఎస్ షర్మిల పాదయాత్రకు పోలీసులు ఎందుకు అనుమతి ఇవ్వడంలేదని ప్రశ్నించారు. నిరవధిక దీక్షను పోలీసులు అనుకుంటున్నారని తన పార్టీ నాయకులు కార్యకర్తలను బేషరతుగా విడుదల చేయాలని షర్మిల డిమాండ్ చేశారు.

తగ్గేదే లేదు అంటూ..

తెలంగాణాలో నాన్‌స్టాప్‌గా ఫైర్‌ ఫైటింగ్ షురూ చేశారు వైటీపీ అధినేత్రి షర్మిల. వరంగల్ జిల్లా నర్సంపేటలో పుట్టిన మంటల తాలూకు సెగ ఇంకా రగులుతూనే ఉంది. న్యూసో, న్యూసెన్సో ఏదో ఒకటి క్రియేట్ అవుతూనే ఉంది. ఎక్కడ ఆగిందో అక్కడే మొదలు పెడతా అంటూ తన పాదయాత్ర మీద పక్కా కమిట్‌మెంట్‌తో ఉన్న షర్మిలకు సర్కార్‌ నుంచి గ్రీన్ సిగ్నల్ ఇంకా రానే లేదు. అందుకే సీన్ ట్యాంక్‌బండ్‌కి మారింది. పాదయాత్రకు పర్మిషన్ కావాలంటూ దీక్షకు దిగేశారు. అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి అక్కడే సిట్టింగేశారు. భారీగా చేరుకున్న కార్యకర్తలు.. వాళ్లను అదుపు చేయడానికి పోలీసుల మోహరింపు మళ్లీ అదే టెన్షన్‌.

ఇవి కూడా చదవండి

ఎందుకింత భయం..

ప్రజల సమస్యలు తెలుసుకోడానికి పాదయాత్ర చేస్తే ప్రభుత్వంలో ఎందుకింత వణుకు అంటూ ప్రశ్నించారు షర్మిల. హైకోర్టు అనుమతినిచ్చినా పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇదేం పాలన, ఇదెక్కడి ప్రజాస్వామ్యం అంటూ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. అయితే, షర్మిల దీక్ష ట్యాంక్‌బండ్‌లో ప్యాకప్ చెప్పినా.. లోటస్‌పాండ్‌ దగ్గర టేకాఫ్ అయింది. కొద్దిసేపు ఇంట్లో దీక్ష చేసి.. సడన్‌గా రోడ్డుపైకొచ్చేశారు. గంటల తరబడి అక్కడే బైఠాయించారు ట్యాంక్‌బండ్‌ దగ్గర తన దీక్షను భగ్నం చేసినందుకు, కార్యకర్తల్ని అరెస్ట్ చేసినందుకు ఆమె మరింత ఫైర్ అయ్యారు. ఇక్కడే షర్మిల తల్లి విజయలక్ష్మి కూడా సీన్లోకొచ్చేశారు. దాంతో లోటస్‌పాండ్‌ దగ్గర కూడా చిన్నసైజు యుద్ధ వాతావరణం. పోలీసులు వర్సెస్ కార్యకర్తలు. వాగ్వాదం, తోపులాట జరిగింది. రోడ్డుపై నుంచి షర్మిలను బలవంతంగా దీక్షా శిబిరంలోకి తరలించారు. ఈ ఘటనతో మరింత రెచ్చిపోయారు షర్మిల. ‘నా కాంపౌండ్‌లోకి చొరబడే హక్కు మీకెక్కడిది.. నా తల్లిని అడ్డుకున్నారు.. మా కార్యకర్తల్ని అరెస్ట్ చేశారు.. నన్ను చంపడానిక్కూడా కుట్ర జరిగింది’ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.

పాదయాత్రకు అనుమతినివ్వాలి.. కార్యకర్తల్ని వదిలిపెట్టాలి.. ఈ రెండే వైఎస్ షర్మిల డిమాండ్లు. వీటిపై ప్రభుత్వం దిగొచ్చేదాకా దీక్ష విరమించబోనన్న షర్మిల.. ఇవాళ కూడా… టాక్ ఆఫ్ ది డే ఔతారేమో!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..