YS Sharmila : మంత్రి కేటీఆర్ ఇలాకా రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్న వైయస్. షర్మిల

|

Jun 25, 2021 | 10:29 AM

తెలంగాణ రాజకీయాల్లోకి సరికొత్తగా అరంగేట్రం చేస్తోన్న వైయస్ షర్మిల ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించబోతున్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని పదిర గ్రామములో కొన్నిరోజుల..

YS Sharmila  : మంత్రి కేటీఆర్ ఇలాకా రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్న వైయస్. షర్మిల
YS Sharmila
Follow us on

Sharmila : తెలంగాణ రాజకీయాల్లోకి సరికొత్తగా అరంగేట్రం చేస్తోన్న వైయస్ షర్మిల ఇవాళ  మంత్రి కేటీఆర్ ఇలాకా అయిన రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఎల్లారెడ్డిపేట మండలంలోని పదిర గ్రామములో కొన్నిరోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వైఎస్సార్ సీపీ జిల్లా యూత్ అధ్యక్షుడు అరుట్ల విక్రమ్ రెడ్డి కుటుంబాన్ని షర్మిల పరామర్శిస్తారు. అనంతరం అల్మాస్ పూర్‌లో కరోనాతో చనిపోయిన కుటుంబాన్ని షర్మిల పరామర్శిస్తారు. సకల జనుల తెలంగాణే లక్ష్యంగా ముందుకు సాగుతానని వైఎస్‌ షర్మిల నిన్న స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

త్వరలో తెలంగాణకు మంచి రోజులొస్తున్నాయని షర్మిల ప్రజలకు భరోసా ఇచ్చారు. ముసలవ్వలు నడిచేందుకు ఊతకర్రనవుతానని, బడి ఫీజులు కట్టలేక అవస్థలు పడుతున్న ఇంటికి పెద్దక్కనవుతానని గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో షర్మిల పేర్కొన్నారు.

డిగ్రీ పట్టా పట్టుకొని రోడ్డు మీదకొచ్చే తమ్ముళ్లు, చెల్లెమ్మల కోసం ఉద్యోగ బాటలు షర్మిల చెప్పుకొచ్చారు. చిన్నారులకు నాణ్యమైన విద్యను అందిస్తానని, మెరుగైన వైద్యం కోసం పడిగాపులు కాసే పరిస్థితిని తెలంగాణ వ్యాప్తంగా సమూలంగా మార్చేస్తానని షర్మిల చెప్పారు.

ఇలా ఉండగా, జూలై 8న పొలిటికల్ పార్టీని స్థాపించబోతున్నామని వైయస్ షర్మిల ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. పార్టీలో కార్యకర్తలకే పెద్ద పీఠ వేస్తామన్న ఆమె, కార్యకర్తలే రేపటి ప్రజానాయకులని చెప్పారు. వైయస్ఆర్ కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లాలి.. వారి వివరాలు, కష్టాలు తెలుసుకోవాలని షర్మిల పార్టీ నేతలు, కార్యకర్తలకు దిశానిర్ధేశం చేస్తున్నారు.

Read also : YS Sharmila: ప్రశ్నించే వాళ్లు ఉండకూడదని సంఘాలను నిర్వీర్యం చేశావ్.. సీఎం కేసీఆర్‌పై షర్మిల విమర్శలు