YS Sharmila Slams on Govt.: ప్రాణాలు పోతుంటే మీకేం పట్టదా.. పరిహారం చెల్లింపులో ఎందుకింత పరిహాసం.. సీఎంకు షర్మిల సూటిప్రశ్న

|

Jun 19, 2021 | 8:29 PM

మల్లన్నసాగర్ ముంపు గ్రామాల ప్రజలకు పరిహారం చెల్లింపులో తెలంగాణ ప్రభుత్వం ఎందుకింత పరిహాసమాడుతున్నారని షర్మిల ప్రశ్నించారు.

YS Sharmila Slams on Govt.: ప్రాణాలు పోతుంటే మీకేం పట్టదా.. పరిహారం చెల్లింపులో ఎందుకింత పరిహాసం.. సీఎంకు షర్మిల సూటిప్రశ్న
Ys Sharmila
Follow us on

YS Sharmila Slams on Telangana Govt.: పరిహారం అందక బాధితులు బలవంతంగా ప్రాణాలు తీసుకుంటుంటే దొర గారికి చీమకుట్టినట్లైనా లేదని వైఎస్ షర్మిల విమర్శించారు. మల్లన్నసాగర్ ముంపు గ్రామాల ప్రజలకు పరిహారం చెల్లింపులో ఎందుకింత పరిహాసమాడుతున్నారని షర్మిల ప్రశ్నించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మరోసారి తనదైన శైలిలో ఫైరయ్యారు వైఎస్ షర్మిల. ప్రాణాలు పోతుంటే తనకేం పట్టనట్లు వ్యవహరిస్తారని మండిపడ్డారు. మల్లారెడ్డి ఆత్మహత్యకు రాష్ట్ర సర్కారే కారణమన్నారు. ప్రాజెక్టుల కోసం సర్వస్వాన్ని త్యాగం చేస్తున్న ముంపు గ్రామాల ప్రజలకు బతికే హక్కు కూడా లేదా అని వైఎస్.షర్మిల ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈమేరకు ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రాజెక్టు మంపు ప్రాంతాల ప్రజలకు వెంటనే పరిహారం అందించాలని షర్మిల డిమాండ్ చేశారు.

న్యాయం కోసం పోరాడుతున్న మల్లన్నసాగర్ ముంపు బాధితుల మనోభావాలను అర్థం చేసుకోకుండా ఐదేళ్లుగా అధికారులు నరకం చూపిస్తున్నారని ఆమె ఆరోపించారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు పూర్తి కావస్తున్నా పరిహారం చెల్లింపు విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇల్లు, వాకిలీ, భూమిని స్వాధీనం చేసుకొని, నిలువ నీడలేకుండా చేసి వేధించడం ఎంత వరకు సమంజమని షర్మిల ప్రశ్నించారు. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమే రైతు మల్లారెడ్డిని బలి తీసుకుందని ఆమె ఆరోపించారు.

అటు..మల్లన్నసాగర్ ప్రాజెక్టు పనులు పూర్తి కావస్తున్నా..పరిహారం, ఇళ్లు, ప్లాట్లు ఇవ్వకుండా ఎర్రవల్లి, పల్లెపహాడ్, వేములఘాట్, ఏటి గట్టుకిష్టాపూర్ గ్రామాలకు నీళ్లు, కరెంట్ నిలిపివేయడం ఏంటని షర్మిల ప్రశ్నించారు. ఒంటరి మహిళలు, పురుషులకు ఇల్లు, పరిహారం ఇవ్వకూడదని ఏ చట్టం చెబుతుందో చెప్పాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ముంపు బాధితులకు సరైన పరిహారం, భరోసా ఇవ్వకుండా మానవత్వం లేకుండా వ్యవహరిస్తోందని ఆమె మండిపడ్డారు. రాష్ర్ట వ్యాప్తంగా అన్ని ప్రాజెక్టుల కింద ఉన్న నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలన్నారు. లేనిపక్షంలో బాధితుల పక్షాన నిలబడి పోరాడుతామన్నారు షర్మిల.

Read Also…  TS Cabinet Meeting Live: తెలంగాణలో ఆంక్షల్లేవు.. అన్నీ ఓపెన్‌.. తెలంగాణలో లాక్‌డౌన్ ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

Telangana Ashada Bonalu: వచ్చే నెల 25,26 తేదీల్లో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ బోనాలు.. ప్రభుత్వ నిబంధనల మేరకే బోనాల జాతర