YS Sharmila political party : రేపు జూలై 8. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వైయస్ కుమార్తె షర్మిల వైయస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రకటన చేయనున్నారు. వైయస్ఆర్ జయంతి సందర్భంగా వైయస్ఆర్ తెలంగాణ పార్టీ జెండా, అజెండా ఆవిష్కరించనున్నారు షర్మిల. ఈ సందర్భంగా ఇప్పటికే షర్మిల బెంగళూరు వెళ్లి అక్కడి నుంచి ఇడుపులపాయలోని వైయస్ఆర్ గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు. రేపు.. వైయస్ సమాధి సందర్శన.. అటు నుంచి హైదరాబాద్ రాక. తర్వాత పార్టీ ప్రారంభ కార్యక్రమాల నిర్వహణ చేస్తారు. దీంతో హైదరాబాద్ బంజారాహిల్స్ లోని లోటస్ పాండ్‌లో సందడి నెలకొనగా, ఓయూ ఆర్ట్స్ కాలేజీలో ఉస్మానియా విద్యార్ధులు – పార్టీ పోస్టర్ ఆవిష్కరించారు.
తండ్రి పేరిట పార్టీ పెట్టబోతున్న షర్మిల వైయస్ సమాధి ఉండే ఇడుపులపాయ లో తండ్రికి శ్రద్ధాంజలి ఘటించి ఆశీర్వాదం కోరతారు. తర్వాత హైదరాబాద్ చేరుకుని వైయస్ఆర్ తెలంగాణ పార్టీ జెండా, అజెండా ఆవిష్కరిస్తారు. రేపటి ఆవిష్కరణ నేపథ్యంలో లోటస్ పాండ్ లో నినాదాలు మిన్నంటుతున్నాయి. తెలంగాణలో రాజనన్న రాజ్యం రావాలంటే.. షర్మిలమ్మ రావాలంటూ కార్యకర్తలు నినదిస్తున్నారు. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీలోనూ పార్టీ ప్రారంభోత్సవ వాతావరణం కనిపిస్తోంది.
ఓయూ ఆర్ట్స్ కాలేజీలో ఉస్మానియా విద్యార్ధులు వైయస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రారంభోత్సవ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్ధి నాయకులు నవీన్, అశోక్ మాట్లాడుతూ తెలంగాణ గడప గడపకూ రాజన్న రాజ్య స్థాపనే లక్ష్యంగా తాము కోరుకుంటున్నట్టు చెప్పారు. హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్‌లో వైయస్ఆర్ తెలంగాణ పార్టీ ఏర్పాటు సందర్భంగా భారీ ఎత్తున విద్యార్దులు తరలి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా షర్మిల ఇప్పటికే పిలుపునిచ్చారు.
YS Sharmilamma Arrives At YSR Guest House In Idupulapaya. @realyssharmila #YSRJayanthi pic.twitter.com/tZVWRfah4E
— YSRTP (@YSSR2023) July 7, 2021