Crime News: నది ఒడ్డున్న చెట్టుకు వేలాడుతున్న యువకుడి మృతదేహాం.. ఆ పక్కనే కనిపించిది చూసి..

గోదావరి ఒడ్డు.. పక్కనే తుమ్మ పొదలు.. ఆ పొదల చాటున ఓ చెట్టు కొమ్మకు వేళాడుతున్న ఓ యువకుడి మృతదేహం.. కట్ చేస్తే ఎదురుగా పండరీనాథ్ విగ్రహం.. ఆ విగ్రహం ముందు పూజలు చేసిన ఆనవాళ్లు. ఇదేదో సినిమా సీన్ కాదు బాసర గోదావరి ఒడ్డున జరిగిన యదార్థ ఘటన. చనిపోయిన యువకుడు ఎవరో తెలియదు.. ఎందుకు చనిపోయాడో అసలు తెలియదు.. ఆత్మహత్య..? హత్యా.. ? చూద్దాం పదండి.

Crime News: నది ఒడ్డున్న చెట్టుకు వేలాడుతున్న యువకుడి మృతదేహాం.. ఆ పక్కనే కనిపించిది చూసి..
Basara Suspicious Death

Edited By:

Updated on: Jan 24, 2026 | 3:38 PM

గోదావరి ఒడ్డున ఉన్న ఒక చెట్టు కొమ్మకు యువకుడి మృతదేహం వేలాడుతున్న ఘటన నిర్మల్ జిల్లాలో వెలుగు చూసింది. మౌనీ అమావాస్య జరిగిన కొన్ని రోజుల తర్వాత చెట్టు ఏదో వేలాడుతున్నట్టు కనిపించడంతో దగ్గరికి వచ్చిన స్థానికులు మృతదేహాన్ని చూసి షాక్ అయ్యారు.అంతే కాదు పక్కనే పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించడంతో భయంతో వణికిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఇది హత్యా, లేదా ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా బాసర గోదావరి ఒడ్డున చెట్టుకు ఉరి వేసుకొని ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతదేహంకు సమీపంలోనే పండర్పూర్ విఠలేశ్వరుడి విగ్రహం ఉండటం.. పసుపు‌కుంకుమతో పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించడంతో యువకుడి మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఏవరైనా క్షుద్ర పూజలు చేసి అతన్ని చంపేశారా?.. లేదా అతనే ఆత్మహత్య చేసుకున్నాడా.. లేక ఎవరైనా హత్య చేసిన ఆత్మహత్యగా క్రియేట్ చేశారా అన్నది తేలాల్సి ఉంది. కేసు‌ నమోదు చేసుకున్న బాసర పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. మృతుడు మహారాష్ట్ర వాసి అయి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.