
చిన్న చిన్న సమస్యలకే యువత ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తల్లిదండ్రులు మందలించారని, కోరికలు నెరవేర్చలేదని, ప్రేమ విఫలమైందని వంటి కారణాలతో తీవ్ర నిర్ణయాలకు దిగుతున్నారు. ఇలాంటి విషాద ఘటన నిర్మల్ జిల్లా కడెం మండలం సారంగపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పోతరాజు రమేష్‌కు ఇద్దరు కుమారులు ఉండగా, చిన్న కుమారుడు రాకేష్ (27) ఇంటి వద్దే ఉంటూ వ్యవసాయ పనులు చేసేవాడు.ఇటీవల తన స్నేహితులు బైక్‌లపై తిరుగుతుండటంతో, తనకూ బైక్ కొనివ్వాలని రాకేష్ తల్లిదండ్రులను పదే పదే అడుగుతున్నాడు. దీనికి తండ్రి రమేష్ పంట కోత పూర్తయ్యాక, పంట అమ్మిన డబ్బులతో తప్పకుండా బైక్ కొనిస్తానని చెప్పుతూ వచ్చాడు. అయితే వెంటనే బైక్ కొనివ్వకపోవడంతో రాకేష్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఆదివారం సాయంత్రం బయటకు వెళ్తున్నానని చెప్పి వెళ్లిన రాకేష్, రాత్రి అయినా ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. చివరకు పొలం వద్ద ఉన్నాడేమోనని వెతుక్కుంటూ వెళ్లిన తండ్రికి షాకింగ్ దృశ్యం కనిపించింది.
పొలం సమీపంలోని చెట్టుకు రాకేష్ ఉరి వేసుకుని మృతదేహంగా కనిపించాడు. ఈ దృశ్యం చూసి తండ్రి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. సమాచారం అందుకున్న స్థానికులు, కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని బోరున విలపించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read: రూ.2 లతో ఎండిపోయే కరివేపాకు మొక్క పచ్చగా, గుబురుగా మారుతుంది..
గమనిక: మీకు లేదా మీకు తెలిసిన వారికి ఇటువంటి ఆలోచనలు ఉంటే, దయచేసి వెంటనే వైద్యులను లేదా హెల్ప్‌లైన్‌ను సంప్రదించండి.
సహాయం కోసం సంప్రదించండి (హెల్ప్‌లైన్‌లు):