Telangana: పండగపూట విషాదం.. లోన్‌యాప్‌ వేధింపులకు మరో యువకుడు బలి.. న్యూడ్ ఫొటోలు షేర్‌ చేయడంతో..

తాజాగా లోన్‌ యాప్‌ల ఆగడాలకు వనపర్తికి చెందిన శేఖర్‌ బలయ్యాడు. కొత్తకోటకు చెందిన శేఖర్ ఓ యాప్ ద్వారా డబ్బు అప్పుగా తీసుకున్నాడు. వాయిదాల పద్ధతిలో చెల్లించే క్రమంలో కొంత ఆలస్యం కావటంతో..రోజూ ఫోన్ చేసి వేధింపులకు గురి చేశారు.

Telangana: పండగపూట విషాదం.. లోన్‌యాప్‌ వేధింపులకు మరో యువకుడు బలి.. న్యూడ్ ఫొటోలు షేర్‌ చేయడంతో..
Suicide

Updated on: Oct 24, 2022 | 1:40 PM

ఆన్‌లైన్‌ లోన్‌యాప్ నిర్వాహకుల ఆగడాలతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. యువత ప్రాణాలు బలి తీసుకుంటున్న లోన్ యాప్ ల పట్ల పోలీసులు, ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరిస్తున్నా.. ఇంకా వారి ఆగడాలు కొసాగుతూనే ఉన్నాయి. అమాయకులకు రుణాలు ఇచ్చి వాటిని గడువు కంటే ముందు చెల్లించాలని వేధింపులు షురూ చేస్తున్నారు. అసలు కంటే మూడు రెట్లు వసూలు చేసి చివరకు ప్రాణాలు తీస్తున్నారు.అంతేకాదు బంధువులకు, స్నేహితులకు అసభ్యకర వీడియోలు, ఫోటోలు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. లోన్‌ యాప్‌ల ఆగడాలకు వనపర్తికి చెందిన శేఖర్‌ బలయ్యాడు. కొత్తకోటకు చెందిన శేఖర్ ఓ లోన్ యాప్ ద్వారా డబ్బు అప్పుగా తీసుకున్నాడు. వాయిదాల పద్ధతిలో చెల్లించే క్రమంలో కొంత ఆలస్యం కావటంతో..రోజూ ఫోన్ చేసి వేధింపులకు గురి చేశారు. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు, స్నేహితులకు న్యూడ్ వీడియోలు పంపి ఇబ్బందులు పెట్టారు. సోషల్‌ మీడియలోనూ షేర్‌ చేశారు.

వీటిని చూసి తీవ్ర మనస్తాపానికి గురైన శేఖర్‌ స్నేహితుడితో తన గోడు వెల్లబోసుకున్నాడు. అనంతరం సోమవారం ఉదయం ఇంట్లోని తన గదిలో ఉరేసుకుని చనిపోయాడు. శేఖర్ మృతికి లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులే కారణమని అతడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి శేఖర్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు తెలిపారు. అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..