క్షణికావేశం నిండు ప్రాణాలను బలి తీసుకుంటుంది. అప్పటివరకు మాట్లాడుతూ కనిపించిన వ్యక్తులు రెప్పపాటులో ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ నడిబొడ్డులో జరిగిన ఓ విషాద ఘటన షాకింగ్‌కు గురి చేసింది. అందరు చూస్తుండగానే ఐదంతస్తుల భవనం పై నుంచి దూకి ఓ యువతి ప్రాణాలు తీసుకుంది. అసలు ఏం జరిగిందో తెలియదు. కానీ నిండు ప్రాణం గాలిలో కలిసింది.
రాంనగర్ చౌరస్తా సమీపంలోని అపార్ట్‌మెంట్ పైనుంచి దూకిన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని గిరి శిఖర అపార్ట్‌మెంట్‌లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే అపార్టమెంట్ లోపలికి వెళ్లిన సనా బేగం (23) అనే యువతి నేరుగా 5వ అంతస్తు టెర్రస్ పైకి వెళ్ళింది. ఫోన్ మాట్లాడుతూ ఒక్కసారిగా ఆమె కిందకి దూకేసింది. సనా బేగం అక్కడికక్కడే మృతి చెందింది.
ఈ ఘటనకు సంబంధించి స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు చిక్కడపల్లి పోలీసులు, క్లూస్ టీం సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. సనా బేగం ఎందుకు మృతి చెందింది..? ఆమె ఆత్మహత్యకు గల కారణాలను చిక్కడపల్లి పోలీసులు ఆరా తీస్తున్నారు. సనా బేగం మృతిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..