Heart Attack: చిన్న వ‌య‌సులో హఠాన్మరణం. గురుకుల పాఠశాల విద్యార్థి ప్రాణం తీసిన గుండెపోటు

గుండెపోటు.. ఈ మధ్య చాలామందికి వస్తోంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, యువకులకు ఎక్కువగా గుండెపోటు వస్తోంది. ఇది ఎప్పుడు ఎవరిని బలితీసుకుంటుందో తెలియడం లేదు. ఒకప్పుడు వయసు మీద పడ్డ వారికి మాత్రమే గుండెజబ్బులు, గుండెపోటు వచ్చేది. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా దీని బారిన పడుతున్నారు.

Heart Attack: చిన్న వ‌య‌సులో హఠాన్మరణం. గురుకుల పాఠశాల విద్యార్థి ప్రాణం తీసిన గుండెపోటు
Student Heart Attack

Updated on: Jan 05, 2024 | 3:08 PM

గుండెపోటు.. ఈ మధ్య చాలామందికి వస్తోంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, యువకులకు ఎక్కువగా గుండెపోటు వస్తోంది. ఇది ఎప్పుడు ఎవరిని బలితీసుకుంటుందో తెలియడం లేదు. ఒకప్పుడు వయసు మీద పడ్డ వారికి మాత్రమే గుండెజబ్బులు, గుండెపోటు వచ్చేది. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా దీని బారిన పడుతున్నారు. తాజాగా నారాయణపేట జిల్లాలో గుండెపోటుతో పదోవ తరగతి విద్యార్థి మృతి చెందిన ఘటన తీవ్ర విషాదం నింపింది.

నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం కొండాపూర్ గిరిజన గురుకుల పాఠశాలలో విషాదం. హన్వాడ మండలం బుడుమకొండ తాండాకు చెందిన 10వ తరగతి విద్యార్థి శ్రీకాంత్ గుండెపోటుతో మృతి చెందారు. అప్పటి వరకు విద్యార్థులతో కలిసి ఉన్న శ్రీకాంత్.. ఉన్నట్టుండీ డార్మెటరీలో కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన విద్యార్థులు ఉపాధ్యాయులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా, అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు వైద్యుల వెల్లడించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..