Yadadri: కన్నుల పండువగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు.. జగన్మోహినీ అవతారంలో..

యాదగిరి లక్ష్మీ నరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రోజుకో అవతారంలో యాదగిరీశుడు దర్శనమిస్తున్నాడు. సంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి...

Yadadri: కన్నుల పండువగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు.. జగన్మోహినీ అవతారంలో..
Yadadri Brahmotsavam

Updated on: Feb 27, 2023 | 8:03 PM

యాదగిరి లక్ష్మీ నరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రోజుకో అవతారంలో యాదగిరీశుడు దర్శనమిస్తున్నాడు. సంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి. నారసింహుడుని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. మార్చి 3వ తేదీన బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఇక సోమవారం ఉత్సవాలు సంబురంగా సాగాయి.

ఉత్సవాల్లో భాగంగా ఉదయం జగన్మోహినీ అవతారంలో దర్శనమిచ్చారు యాదగిరీశుడు.. సాయంత్రం ఎదుర్కోలు ఉత్సవాల్లో భాగంగా.. హంసవాహనంపై ఊరేగారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం దేదీప్యంగా అలరారుతూ దర్శనమిచ్చింది. నారసింహ వైభవాన్ని కనులారా దర్శించేందుకుగానూ.. భక్తజన సందోహం భారీగా తరలివచ్చింది. ఆలయంలోని బ్రహ్మోత్సవ శోభను చూసి భక్తులు పులకించి పోయారు. యాదగిరీశుడి నవ్యప్రాంగణం శోభాయమానంగా దర్శనమిస్తోంది.

ఇవి కూడా చదవండి

ఇక విద్యుత్ కాంతుల్లో యాదాద్రి ఆలయం దగదగ మెరిసిపోతుంది. ఆలయ పరిసరాలన్నీ కూడా విద్యుత్ కాంతులతో దర్శనమిస్తున్నాయి. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో మార్చి 3వ తేదీ వరకు ఆర్జిత సేవలను రద్దు చేశారు. ఆలయంలో నిర్వహించే నిత్యకల్యాణం, శ్రీసుదర్శన నారసింహ హోమం, బ్రహ్మోత్సవం, బాలభోగం, అభిషేకం, అర్చనలను నిలివేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..