కుక్క కోసం.. కుక్కల్లా కొట్టుకున్నారు..

| Edited By:

Apr 22, 2019 | 4:59 PM

పెద్దపల్లి జిల్లాలో కుక్క కోసం తన ఇంటి పక్కనే ఉన్న మహిళలను చితక్కొట్టాడో వ్యక్తి. విచక్షణ మరిచి అత్యంత దారుణంగా కొట్లాడాడు. రక్తం కారేలా మహిళల జుట్టుపట్టుకుని చితకబాదాడు. కాళ్లతో తన్నుతూ నానా బీభత్సం సృష్టించాడు. గాంధీనగర్‌లోని నివాసముంటున్న జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి కట్నూరి సందీప్.. మహిళలపై దాడి చేయడం స్థానికంగా వివాదాస్పదమైంది. సందీప్‌కు చెందిన పెంపుడు కుక్క.. పక్కింటి పరిసరాలను అపరిశుభ్రం చేయడంతో వాగ్వాదం జరిగింది. మాటా.. మాటా.. పెరిగి ఇరు కుటుంబాల మహిళలు ఒకర్నొకరు […]

కుక్క కోసం.. కుక్కల్లా కొట్టుకున్నారు..
Follow us on

పెద్దపల్లి జిల్లాలో కుక్క కోసం తన ఇంటి పక్కనే ఉన్న మహిళలను చితక్కొట్టాడో వ్యక్తి. విచక్షణ మరిచి అత్యంత దారుణంగా కొట్లాడాడు. రక్తం కారేలా మహిళల జుట్టుపట్టుకుని చితకబాదాడు. కాళ్లతో తన్నుతూ నానా బీభత్సం సృష్టించాడు.

గాంధీనగర్‌లోని నివాసముంటున్న జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి కట్నూరి సందీప్.. మహిళలపై దాడి చేయడం స్థానికంగా వివాదాస్పదమైంది. సందీప్‌కు చెందిన పెంపుడు కుక్క.. పక్కింటి పరిసరాలను అపరిశుభ్రం చేయడంతో వాగ్వాదం జరిగింది. మాటా.. మాటా.. పెరిగి ఇరు కుటుంబాల మహిళలు ఒకర్నొకరు కొట్టుకునే దాకా వెళ్లింది.

విషయం తెలుసుకున్న సందీప్ కోపంతో ఊగిపోతూ తమ వారిపైనే దాడి చేస్తారా అంటూ పక్కింటి వాళ్లపై విరుచుకుపడ్డాడు. మహిళల జుట్టు పట్టుకుని కొట్టుకుంటూ ఈడ్చుకెళ్లాడు. తీవ్రంగా గాయపడ్డ మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సందీప్‌ను అరెస్ట్ చేశారు.