Telangana Politics: కాంగ్రెస్.. వైఎస్ఆర్‌టీపీ మధ్య పొత్తు పొడుస్తుందా..? ఆసక్తికరంగా తెలంగాణ రాజకీయాలు..

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. ఇప్పుడు అదే నిజం కాబోతుందా. కాంగ్రెస్‌కు దూరం జరిగిన వైఎస్ కుటుంబం.. ఇప్పుడు హస్తంపార్టీతో చేయి కలుపుతుందా..? సోదరుడిపై కేసులు పెట్టిన కాంగ్రెస్ తో షర్మిల కలిసి పనిచేస్తారా? భవిష్యత్తులో రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి.. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. తెలంగాణలో రాజకీయాలు మరింత వేడెక్కాయి..

Telangana Politics: కాంగ్రెస్.. వైఎస్ఆర్‌టీపీ మధ్య పొత్తు పొడుస్తుందా..? ఆసక్తికరంగా తెలంగాణ రాజకీయాలు..

Updated on: Apr 03, 2023 | 7:39 AM

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. ఇప్పుడు అదే నిజం కాబోతుందా. కాంగ్రెస్‌కు దూరం జరిగిన వైఎస్ కుటుంబం.. ఇప్పుడు హస్తంపార్టీతో చేయి కలుపుతుందా..? సోదరుడిపై కేసులు పెట్టిన కాంగ్రెస్ తో షర్మిల కలిసి పనిచేస్తారా? భవిష్యత్తులో రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి.. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. తెలంగాణలో రాజకీయాలు మరింత వేడెక్కాయి..

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలపై తెలంగాణలో కాంగ్రెస్ తో కలిసిపోరాడేందుకు తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ షర్మిల రెడీ అవుతున్నారు. తెలంగాణలోని ప్రతిపక్షాలకు వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల లేఖ రాశారు. నిరుద్యోగుల సమస్యలపై పోరాడేందుకు బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం, టీడీపీ, తెలంగాణ జనసమితి, జనసేన, బీఎస్పీ, సీపీఐ, సీపీఎం, ఎమ్మాఆర్పీఎస్ లతో పాటు ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు తమతో కలిసి రావాలని లేఖలో కోరారు. నిరుద్యోగులకు న్యాయం జరగాలంటే ప్రతిపక్షాలంతా ఏకతాటి మీదకు రావాల్సిన అవసరం వచ్చిందన్నారు.. సర్కారుపై నిరుద్యోగ సైరన్ మోగించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జెండాలు వేరైనా ఒకే అజెండాగా ఏకమైన పార్టీలు.. నేడు స్వరాష్ట్రంలో నిరుద్యోగ యువత కోసం మళ్లీ ఏకం కావాల్సిన అవసరం ఏర్పడిందన్నారు షర్మిల. 1200మంది ఆత్మబలిదానాల మీద ఏర్పడిన తెలంగాణలో నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందన్నారు. దీనిపై పోరాడేందుకు తెలంగాణ బీజేపీ, కాంగ్రెస్ అధ్యక్షులకు కాల్ చేశారు షర్మిల. రాష్ట్రంలో ఒకే వేదికను కలిసి పంచుకొని.. నిరుద్యోగ సమస్యను తీవ్రరూపం దాల్చుతామని చెప్పారు షర్మిల.

రేవంత్ రెడ్డి రియాక్షన్ ఏంటంటే..?

నిరుద్యోగ సమస్యపై కలిసి పనిచేద్దామంటూ షర్మిల తమకు కాల్ చేశారని చెప్పారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. అటు దేశంలో, ఇటు రాష్ట్రంలో ప్రజలకు అన్యాయం చేస్తున్న పార్టీలతో తాము సమదూరమని.. అలాంటి పార్టీలతో షర్మిల చెప్పినట్లు కలిసి వేదిక పంచుకోలేమని చెప్పారు రేవంత్.

ఇవి కూడా చదవండి

అలా అయితే..

వైఎస్ మరణం అనంతరం జరిగిన పరిణామాలతో కాంగ్రెస్ కు దూరమైంది వైఎస్ కుటుంబం. తన సోదరుడిపై కేసులు పెట్టించిన పార్టీతో అప్పడు పాదయాత్ర ద్వారా ఫైట్ చేశారు షర్మిల. కాంగ్రెస్ పై దుమ్మెత్తిపోశారు. అవన్ని మరిచిపోయి వెనకటికి చెప్పినట్లు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే సామేత మేరకు సోదరుడిపై కేసులు పెట్టించిన పార్టీతో సోదరి స్నేహ హస్తం అందిస్తారా? త్వరలో రెండు పార్టీలు కలిసి పోరాటాలకు ప్రణాళికలు రచిస్తాయా? రేవంత్ చెప్పినట్లు వీరి కలయికకు బీజేపీనీ అడ్డంకినా?. బీజేపీకి దూరం జరిగి.. షర్మిల ఒక్కరే ఫైట్ చేస్తే కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది. ఏదీ ఏమైనా అటు షర్మిల, రేవంత్ స్టేట్మెంట్స్ రానున్న రోజుల్లో రెండు పార్టీల మధ్య అలయెన్స్ దారి తీస్తాయా? లేక నిరుద్యోగ సమస్య వరకే సరిపెడతాయో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..