Schools Reopen: కరోనా మహమ్మారి కారణంగా మూతపడ్డ పాఠశాలలు జూలైన 1నుంచి తిరిగి ప్రారంభించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా కేసులు తగ్గడంతో ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ఎత్తేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో పాఠశాలలను తిరిగి ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ప్రైవేటు పాఠశాలలు తిరిగి స్కూల్స్‌ను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే ఎలాంటి సన్నద్ధత లేకుండా పాఠశాలలు ఎలా ప్రారంభిస్తారని హైకోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో పాఠశాలలు నిజంగానే 1వ తేదీ నుంచి ప్రారంభమవుతాయా? లేదా వాయిదా పడతాయా? అన్న దానిపై అటు విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రుల్లోనూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రైవేటు పాఠశాలల యజమానులు ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే తాము పాఠశాలల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామంటున్నాయి.. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు. ఇప్పటికే దానికి ఒక ప్రణాళిక రచించామని అంటున్నారు. రోజు విడిచి రోజు ఆన్లైన్, అఫ్ లైన్ లో తరగతులు నిర్వహిస్తామంటున్నారు. కరోనా కొత్త వేరియంట్స్ వస్తుండడంతో పేరెంట్స్ లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి అని .అయితే తగిన జాగ్రత్తలతో విద్యార్థులు తరగతులకు హాజరు కావచ్చని అంటున్నారు.
ఇక కరోనా థార్డ్ వేవ్ పొంచి ఉందన్న వార్తలు వస్తోన్న క్రమంలో.. అది కూడా చిన్నారులే దీనికి ఎక్కువగా ప్రభావితమవుతారన్న కారణంగా చిన్నారులను పాఠశాలలకు పంపించేందుకు తల్లిదండ్రులు కూడా సంశయిస్తున్నారు. ఎన్ని రకాల రక్షణ చర్యలు తీసుకున్నా..పెద్ద వాళ్లే కోవిడ్ బారిన పడుతుంటే చిన్నపిల్లల్ని పంపించి మరిన్ని ఇబ్బందులు కొని తెచ్చుకోలేమని అంటున్నారు. పాఠశాలలో చేరే వరకు అలాగే అంటారు కానీ పిల్లలకు ఏదైనా జరిగితే బాధపడేది తల్లిదండ్రులమే కదా అని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా మరికొద్ది రోజులు వేచి చూస్తే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం అందరికీ వ్యాక్సినేషన్ పూర్తయిన తర్వాత మాత్రమే పిల్లలను పాఠశాలకు పంపిస్తే బాగుంటుందని అంటున్నారు. అయితే ఇప్పటికే చిన్నారులు స్కూళ్లకు వెళ్లక చాలా రోజులవుతుందని.. ఇలాగే కొనసాగితే వారిపై ప్రతికూల ప్రభావం పడే అవశాకాలున్నాయని. స్కూళ్లను తిరిగి ప్రారంభించాలని మరికొందరు భావిస్తున్నారు.