ఒకవైపు కరోనా వైరస్ దేశంలో అతాకుతాలం చేస్తుండా.. మరోవైపు అధిక ఉష్ణోగ్రతలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎండాకాలం మొదలైంది..ఎండలు మండిపోతున్నాయి. గత కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఇక గత రెండు రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ వర్షాలు పడడంతో కాస్తా ఉపశమనం లభించింది. ఇక వేసవిలో ఈ మండుటెండలకు మనుషులతో పాటు మూగజీవాలు సైతం అల్లాడిపోతున్నాయి. ఇక అడవులలో చెట్లు తగ్గిపోవడంతో నీటి శాతం కూడా తగ్గిపోయింది. దీంతో దాహం తీర్చుకునే ప్రయత్నంలో అప్పుడప్పుడు అడవి జంతువులు ప్రమాదాల బారినపడటం చూస్తున్నాం.. ఇందుకు సంబంధించిన వీడియోలు, వార్తలు ఎప్పుడూ సోషల్ మీడియాలో చూస్తునే ఉన్నాం. తాజాగా తెలంగాణలోని కొమురంభీం జిల్లాలో ఓ అడవి దున్న నీళ్ల కోసం వచ్చి బావిలో పడిపోయింది.
కొమురంభీం జిల్లా తాడేపల్లి అటవీ ప్రాంత సమీపంలో ఓ అడవి దున్న బావిలో పడింది. ఇక అందులో నుంచి బయటకు వచ్చేందుకు శతవిధాలుగా ప్రయత్నించింది. కానీ కుదరలేదు. ఇక బావిలో నుంచి దున్న అరుపులు విన్న స్థానిక రైతులు అక్కడకు వచ్చి చూడగా.. అందులో చిన్న అడవి దున్న కనిపించింది. వెంటనే వారు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు, రెస్క్యూ సిబ్బంది జేసీబీ సాయంతో బావిలోంచి దున్నను బయటకు తీశారు. కొద్ది గంటలపాటు ప్రయత్నించిన అధికారులు ఎట్టకేలకు దానిని బయటకు తీశారు. ఇక అధికారుల చొరవతో బయటపడ్డ దున్న బతుకు జీవుడా అంటూ అడవిలోకి పరుగులు తీసింది. ఇక ఆ అడవి దున్నకు ఎలాంటి గాయాలు గానీ, అనారోగ్యం గానీ లేదని.. అది సురక్షితంగా బయటపడిందని అటవీ సిబ్బంది తెలిపారు.
పెళ్ళి చేసుకున్న పాపులర్ కమెడియన్స్.. 9 రోజుల తర్వాత షాకిచ్చిన పోలీసులు.. ఇంతకీ ఏం జరిగిందంటే..