Khammam: పాపం చేసిన ప్రశాంతి.. మంచిగా ఉన్న భర్తను ఏం చేసిందో తెలిస్తే ఫ్యూజులు ఎగరాల్సిందే

పెళ్లై చానా ఏళ్లయింది.. అన్యోన్య జీవితం.. భార్య భర్తలిద్దరూ బాగానే ఉన్నారు.. అయితే.. భర్త మాత్రం తాగుడుకు బానిసవ్వడంతో.. అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో ఆమెలో నడవడికలో మార్పు వచ్చింది.. ఎలాగైనా అతను చనిపోతాడని భావించి.. అతని పేరుతో ఇన్సూరెన్స్ కట్టించింది.. దీంతో సుఖంగా ఉండవచ్చని భావించింది.. చివరకు అలా జరగలేదు..

Khammam: పాపం చేసిన ప్రశాంతి.. మంచిగా ఉన్న భర్తను ఏం చేసిందో తెలిస్తే ఫ్యూజులు ఎగరాల్సిందే
Khammam Crime News

Updated on: Mar 09, 2026 | 9:34 AM

పెళ్లై చానా ఏళ్లయింది.. అన్యోన్య జీవితం.. భార్య భర్తలిద్దరూ బాగానే ఉన్నారు.. అయితే.. భర్త మాత్రం తాగుడుకు బానిసవ్వడంతో.. అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో ఆమెలో నడవడికలో మార్పు వచ్చింది.. ఎలాగైనా అతను చనిపోతాడని భావించి.. అతని పేరుతో ఇన్సూరెన్స్ కట్టించింది.. దీంతో సుఖంగా ఉండవచ్చని భావించింది.. చివరకు అలా జరగలేదు.. భర్త..ఆరోగ్యం కుదుటపడింది.. భార్య ప్లాన్ మాత్రం బెడిసి కొట్టింది.. దీంతో భర్త చనిపోవడం లేదని.. ఆమెనే మరో నలుగురితో కలిసి.. చంపించింది.. ఈ దారుణ ఘటన ఖమ్మం నగరంలో కలకలం రేపింది. ఖమ్మం నగరంలో సంచలనం రేపిన ఆటో డ్రైవర్ చాగంటి రవి (52) హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. భార్యనే.. భర్తను హత్య చేయించిందని పోలీసులు వెల్లడించారు. భర్త అనారోగ్యంతో చనిపోతాడని భావించిన భార్య.. అతని పేరుపై రూ.66 లక్షలకు ఇన్సూరెన్స్ చేయించింది. ఆ తర్వాత.. అతను చనిపోకపోవడంతో.. ఆ డబ్బుల కోసం భర్తను దారుణంగా చంపించిందని.. ఈ కేసులో ఆమెతో పాటు మరో నలుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం నగరానికి చెందిన రవి మద్యానికి బానిసై కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో అతని భార్య ప్రశాంతి.. భర్త ఎలాగూ చనిపోతాడనే.. డబ్బుల కోసం ప్లాన్ వేసింది. తన బంధువు శ్రీనివాస్ సహాయంతో గత ఏడాది జులైలో రవి పేరు మీద రూ.66 లక్షలకు ఇన్సూరెన్స్ పాలసీ చేయించింది.

అయితే, చనిపోతాడనుకున్న భర్త ఆరోగ్యం కుదుటపడటం చూసి ఆమె తట్టుకోలేకపోయింది. చివరకు.. బీమా డబ్బుల కోసం భర్తను చంపాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో బంధువు శ్రీనివాస్‌తో పాటు జోగి రాజ్‌కుమార్, జోగి వెంకటేష్, జోగి రాంబాబులతో ఒప్పందం కుదుర్చుకుంది. హత్య చేస్తే వచ్చే బీమా డబ్బులో సగం ఇస్తానని వారితో చెప్పింది. దీనిగురించి వారితో మాట్లాడి డీల్ కుదుర్చుకుంది.

ఆమె వేసిన స్కెచ్ ప్రకారం.. రవికి మార్చి 2వ తేదీన ఫుల్లుగా మద్యం తాగించారు.. అనంతరం ఖమ్మం సమీపంలోని వీవీ పాలెం శివారు ప్రాంతానికి తీసుకెళ్లారు. రవి రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు ప్లాన్ ను రచించారు. రవిని కారుతో ఢీకొట్టి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారని పోలీసులు తెలిపారు.

అయితే, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అనుమానంతో లోతుగా దర్యాప్తు చేశారు. పలు సాంకేతిక ఆధారాల సాయంతో.. రోడ్డు ప్రమాదం కాదు.. హత్యగా నిర్ధారించుకున్నారు. ఈ హత్య కేసులో ప్రధాన సూత్రధారి మృతుడి భార్య.. ప్రశాంతితో పాటు మిగిలిన నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us