Medak: మృతదేహాన్ని దింపుడు కల్లం వద్ద దించినప్పుడు డౌట్ వచ్చింది.. దీంతో వెంటనే..

పాపన్నపేట మండలం బాచారం గ్రామానికి చెందిన ఆశయ్య (55), శివమ్మ భార్యాభర్తలు. స్థానికంగా ఉన్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసుకుంటున్నారు. ఈ నెల 15న పొలం పనులకు వెళ్లిన ఆశయ్య ఒడ్డు మీద నడుస్తూ.. ప్రమాదవశాత్తు కాలు జారి పోలంలో పడిపోయాడు. ఈ ఘటనలో అతని నడుముకు గాయమైంది.

Medak: మృతదేహాన్ని దింపుడు కల్లం వద్ద దించినప్పుడు డౌట్ వచ్చింది.. దీంతో వెంటనే..
Dead Body (Representative image)

Edited By: Ram Naramaneni

Updated on: Feb 19, 2025 | 1:19 PM

భార్య భర్తల అనుబంధం ఎంతో పవిత్రమైనది..ఒకరి కోసం మరొకరు పడే తపన అంత ఇంత కాదు..ఒకరికి ఒకరు తోడుగా చివరి వరకు కలసి ఉంటామని అని,పెళ్లిలో ప్రమాణం చేస్తారు..అంతంటి పవిత్రబంధన్ని హేళన చేసే విధంగా కొంతమంది వ్యవహార శైలి ఉంటుంది..ఒకరికి ఒకరు తోడుగా ఉండడం పక్కన పెడితే..ఒకరిని ఒకరు చంపుకుంటున్నారు. భర్త కష్ట కాలంలో ఉన్నప్పుడు అతనికి తోడుగా ఉండాల్సిన భార్య అతనికి సేవ చేయాల్సి వస్తుంది అని.. అల్లునితో కలసి హత్య చేసింది. వివరాల్లోకి వెళ్తే..భర్త వైద్యానికి అయ్యే ఖర్చును భరించలేక అతడిని, అల్లుడితో కలిసి ఉరేసి హత్య చేసింది ఓభార్య. పైగా దీనిని సహజ మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది…కానీ అతని మెడపై కమిలిపోయిన గాయాలు ఉండటంతో.. మృతుడి సోదరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. కాగా ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం..మెదక్ జిల్లా పాపన్నపేట (మం) బాచారం గ్రామానికి చెందిన కర్రెల ఆశయ్య (45), శివ్వమ్మలకు కూతురు లావణ్య, కొడుకు శివకుమార్ ఉన్నారు .కాగా వీరికి ఉన్న ఎకరన్నర అసైన్డ్ భూమిలో పంటలు పండకపోవడంతో, హైదరాబాద్ నగరానికి కూలీలుగా వలస వెళ్లారు.

కాగా రోడ్డు ప్రమాదంలో కొడుకు చనిపోవడంతో తిరిగి మళ్లీ వారి స్వగ్రామానికి వచ్చారు. కూతురు లావణ్యను జూకల్‌కు చెందిన రమేశ్ అనే వ్యక్తికి ఇచ్చి వివాహం చేసి ఇల్లరికం తెచ్చారు. కాగా ఆశయ్య గ్రామంలోనే పశువులు కాస్తు ఉండేవాడు.. కాగా ఇటీవల వారికి ఉన్న పోలంలో బోరు వేసి, ఆ భూమిని వ్యవసాయనికి ఉపయోగంగా మార్చారు.. అయితే శనివారం పొలం పనులకు వెళ్లిన ఆశయ్య.. పొలం గట్టు పై నుంచి
జారిపడగా, అతనికి తుంటి ఎముక విరిగింది..దీనితో ఆసుపత్రికి తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. కాగా ఆశయ్యకు శస్త్ర చికిత్సకు లక్షల్లో ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు. ఇంటికెళ్లిన తర్వాత వైద్య ఖర్చులు ఎలా భరించాలి అనుకున్నారో, అవిటితనంతో కుటుంబానికి భారమవుతాడని భావించారో, లేక రైతు బీమా కోసం ఆశ పడ్డారో తెలియదు కానీ ఆదివారం అర్ధరాత్రి అల్లుడు రమేష్‌తో కలిసి, శివ్వమ్మ నిద్రలో ఉన్న భర్త ఆశయ్య మెడకు తువ్వాలతో ఉరేసి హత్య చేసింది. పొద్దున లేవగానే ఆశయ్యది సహజ మరణంగా చిత్రీకరించారు. అయితే సోమవారం సాయంత్రం అంతిమయాత్ర జరుగుతుండగా ఆశయ్య మృతదేహాన్ని దింపుడు కల్లం వద్ద ఆపారు. ఆ సమయంలో మెడపై ఉన్న గుర్తులు చూసి మృతుడి సోదరికి అనుమానం వచ్చింది. దీంతో పోలీసులకు సమాచారమిచ్చారు.  అక్కడకు చేరుకున్న పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్ గౌడ్ శవాన్ని స్వాధీనం చేసుకొని మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి సోదరి గంగమణి ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Asayayya

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి