AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: వాట్సాప్‌లో వీటిని గుడ్డిగా నమ్మకండి.. లేదంటే నెక్ట్స్ బాధితులు మీరే కావచ్చు.. జాగ్రత్త!

రోజురోజుకూ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. తాజాగా కంపెనీ ఎండీ పేరుతో నకిలీ వాట్సాప్ ప్రొఫైల్ సృష్టించి ఏకంగా రూ. 4.70 కోట్లు కాజేసిన ఇద్దరు సైబర్ నేరగాళ్లను ఎట్టకేలకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు చేధించారు.ఈ కేసుకు సంబంధిచిన ఇద్దరు మ్యూల్ అకౌంట్ హోల్డర్లను, ఏజెంట్లను అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు..

Hyderabad: వాట్సాప్‌లో వీటిని గుడ్డిగా నమ్మకండి.. లేదంటే నెక్ట్స్ బాధితులు మీరే కావచ్చు.. జాగ్రత్త!
Cyber Fraud Hyderabad
Anand T
|

Updated on: Jul 08, 2026 | 7:30 PM

Share

ఓ ప్రముఖ కంపెనీ ఎండీ పేరుతో వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేసి.. అతని ప్రొఫైట్ ఫోటో ద్వారా ఏకంగా రూ.4.70 కోట్లు కాజేసిన కేటుగాళ్లు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పోలీసులు పట్టుకున్నారు. నిందితులు దోసపాటి కృష్ణసాయి, మండవల్లి శివ నాగరాజుగా గుర్తించారు. వీరు సైబర్ మోసగాళ్లకు బ్యాంకు ఖాతాలు సమకూర్చి కమిషన్‌గా సుమారు 4 లక్షలు పొందినట్లు దర్యాప్తులో తేలింది. వీరికి మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడులో నమోదైన పలు సైబర్ నేరాలతో ఖాతాకు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

పోలీసుల కథనం ప్రకారం.. ఒక ప్రముఖ కంపెనీ ఎండీ ఫోటో, పేరుతో ఉన్న వాట్సాప్ నంబర్ నుంచి సదురు కంపెనీలో పనిచేస్తున్న ఓ ఎంప్లాయ్‌కు కొన్ని మెసేజ్‌లు వచ్చాయి. అవి నిజంగానే తన బాస్ పంపినవని నమ్మిన బాధితుడు, సదరు నంబర్ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం వివిధ బ్యాంక్ ఖాతాలకు విడతలవారీగా మొత్తం రూ.4.70 కోట్లు బదిలీ చేశాడు. కట్‌చేస్తే.. అది తన బాస్ కాదని తెలియడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేయడంతో ఘటనపై కేసు నమోదు చేసుకన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఈ కేసులో సాంకేతిక విశ్లేషణ, బ్యాంక్ ఖాతాల పరిశోధన ఆధారంగా పోలీసులు ఇద్దరు నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితులను ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన దోసపాటి కృష్ణసాయి, హైదరాబాద్ కొత్తపేటలో నివసిస్తున్న మండవల్లి శివ నాగరాజుగా గుర్తించారు. వీరు సైబర్ నేరగాళ్లకు కమిషన్ల ఆశ చూపి కరెంట్ బ్యాంక్ ఖాతాలను సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలింది. ఇలా చేసేందుకు వీరు రూ.4లక్షల కమిషన్ తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

సైబర్ నేరాల పోలీసులు సూచనలు

  • వాట్సాప్‌లో మీకు తెలిసిన వారి పేరు లేదా ఫోటో కనిపించినంత మాత్రాన దాన్ని బ్లైండ్‌గా నమ్మవద్దని పోలీసులు చెబుతున్నారు. ఎందుకంటే సైబర్ నేరగాళ్లు ఇతరుల ఫోటోలను సులువుగా కాపీ చేసి వాడుకునే ఛాన్స్ ఉందని హెచ్చరించారు.
  • ఎవరైనా ఎమర్జీగా డబ్బు కావాలని కొత్త అకౌంట్‌ నెంబర్ చెబితే వాటికి వెంటనే డబ్బులు పంపకండి.. పూర్తిగా కన్ఫర్మేషన్ తెచ్చుకున్నాడే డబ్బులు వేయండి.
  • కేవలం వాట్సాప్ మెసేజ్‌ల ఆధారంగా ఎలాంటి ఆర్థిక లావాదేవీలు చేయవద్దు. ఫోన్ కాల్ లేదా నేరుగా కలిసి నిర్ధారించుకోండి.
  • ఒకవేళ సైబర్ మోసానికి గురైతే, ఆలస్యం చేయకుండా వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయండి లేదా జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us