Telangana Polls 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార ఘట్టం తుది అంకానికి చేరింది. మరో వారం రోజుల్లో ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారంపై ఫుల్ ఫోకస్ పెట్టాయి. ఈ నేపథ్యంలో తెలుగు న్యూస్ మీడియా చరిత్రలో మొట్టమొదటిసారి టీవీ9 మెగా పొలిటికల్ కాంక్లేవ్ నిర్వహించనుంది. దేశంలో నెంబర్.1 న్యూస్ నెట్‌వర్క్ టీవీ9 గురువారం(నవంబరు 23) రోజంతా ఈ బిగ్గెస్ట్ పొలిటికల్ కాంక్లేవ్ నిర్వహించనుంది. WHAT TELANGANA THINKS TODAY అనే నినాదంతో నిర్వహించనున్న ఈ కాంక్లేవ్‌లో తెలంగాణ ఏం ఆలోచిస్తోంది..? తెలంగాణ ఏం కోరుకుంటోంది..? అనే అంశాలను సుదీర్ఘ చర్చ జరగనుంది. తెలంగాణ నాయకుల విజన్ ఏంటి? తెలంగాణ భవిష్యత్తుకు వాళ్లు ఇచ్చే బ్లూ ప్రింట్ ఏంటి? అనే అంశంపై రాజకీయ ప్రముఖుల నుంచి సమాధానం రాబట్టనుంది టీవీ9. తెలంగాణ రాజకీయ పార్టీల ఆలోచనలు, విశ్లేషణలకు ఇది వేదిక కానుంది. హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో గరువారం ఉదయం 10 గం.ల నుంచి రాత్రి 10 గం.ల వరకు నిరవధికంగా ఈ కాంక్లేవ్ ఉంటుంది.
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఈ కాంక్లేవ్‌లో పలువురు రాజకీయ ప్రముఖులు, విశ్లేషకులు పాల్గొననున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి హరీష్ రావు, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కే లక్ష్మణ్, మల్లా రెడ్డి, జగ్గా రెడ్డి, అసదుద్దీన్ ఒవైసీ, ప్రకాష్ జవదేకర్, ఆర్ కృష్ణయ్య, మందకృష్ణ మాదిగ, వినోద్, మురళీధర్ రావు, మధుయాష్కీ, రేణుకా చౌదరి తదితరులు ఈ కాంక్లేవ్‌లో పాల్గొని తమ పార్టీల ఆలోచనను ఆవిష్కరించనున్నారు. ఆయా పార్టీల ఎన్నికల మేనిఫెస్టోలోని కీలక అంశాలు, సామాజిక సమీకరణలు, మైనార్టీ అంశం తదితర అంశాలపై చర్చ జరగనుంది.
తెలంగాణ దంగల్.. టీవీ9 కాంక్లేవ్..
తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో నవంబరు 30న పోలింగ్ జరగనుంది. డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. నవంబరు 28న సాయంత్రం 5 గం.లతో తెలంగాణలో ఎన్నికల ప్రచారం పరిసమాప్తంకానుంది.