Weather Report Telangana: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గణనీయంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. పంజా విసురుతున్న చలి పులి..

తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగ పడిపోతున్నాయి. చలి గాలుల తీవ్రత మరింత పెరిగింది. ఇక రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే..

Weather Report Telangana: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గణనీయంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. పంజా విసురుతున్న చలి పులి..

Updated on: Dec 28, 2020 | 5:56 AM

Weather Report Telangana: తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగ పడిపోతున్నాయి. చలి గాలుల తీవ్రత మరింత పెరిగింది. ఇక రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే చలి పంజా విసురుతోంది. ఉదయం 10 గంటల వరకు కూడా మంచు తెరలు వీడటం లేదు. దాంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ఇబ్బంది పడుతున్నారు. చలి కారణంగా ఆయా ప్రాంతాల్లో ప్రజలు చలిమంటలు లేనిదే ఉండలేని పరిస్థితి నెలకొంది. ఇక ఉష్ణోగ్రతల వివరాలు చూసుకున్నట్లయితే.. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా గిన్నెధరిలో కనిష్టంగా 6.8 డిగ్రీల సెల్సియస్‌తో రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. తిర్యాణి, అర్లి(టి)లో 7.1 డిగ్రీల సెల్సియస్, వాకిండి 7.2, బేల 7.4, సిర్పూర్‌(యు)8.3, కెరమెరి 8.8, రామగుండం 11.6, మెదక్‌ 11.9, హకీంపేట 13.8, హన్మకొండ 14, హైదరాబాద్‌లో 14.5, నిజామాబాద్‌లో 14.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

 

Also read:

దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న కరోనా కేసులు.. 24 గంటల్లోనే 16 మంది మృత్యువాత..

Road Accident: గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టిన లారీ..