కూల్.. కూల్.. మండు వేసవి నుంచి కాస్త ఉపశమనం భానుడి భగభగలు, ఉక్కపోత నుంచి కాస్త సేద తీరుతున్నారు ప్రజలు. తెలంగాణలో వాతావరణం చల్లబడింది. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశముందని ప్రకటించింది హైదరాబాద్ వాతావరణ శాఖ. ఇక తెలంగాణలోనూ ఆదివారం, సోమవారం చిరు జల్లులు పడే చాన్సుందని తెలిపింది. ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమలో పలు చోట్ల ఉరుములతో కూడిన వర్షం పడుతుందని వెల్లడించింది. ఉపరితల ద్రోణి కారణంగా మధ్య ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ వరకు దీని ప్రభావం ఉంటుందని తెలిపింది. రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఉపరితల ద్రోణి కారణంగా మధ్య ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ వరకు దీని ప్రభావం ఉంటుంది. ఛత్తీస్గఢ్ నుంచి కర్ణాటక వరకు సముద్ర మట్టానికి సగటున 900 మీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఏపీ వాసులకు చల్లని కబురు..
ఏపీ వాసులకు ఎండ వేడి నుంచి ఉపశమనాన్ని ఇచ్చే చల్లటి కబురును అమరావతి వాతావరణ శాఖ చెప్పింది. శనివారం నుంచి 3 రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణములో నైరుతి గాలులు వీస్తున్నాయి. తత్ఫలితంగా రాగల మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది అమరావతి వాతావరణ కేంద్రం చెప్పింది.
ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం: ఈరోజు, రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు లేదా మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఎల్లుండి తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్ర: ఈరోజు ,రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
రాయలసీమ: ఈరోజు ,రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. మరియు ఉరుములు లేదా మెరుపులు తో కూడిన ఈదురు గాలులు 3౦నుండి 40 కి మీ వేగము తో ఒకటి లేక రెండు చోట్ల సంభవించే అవకాశము ఉంది. ఎల్లుండి తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి: TRS Foundation Day: ఏప్రిల్ 27న టీఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవం.. హెచ్ఐసీసీ సభకు భారీగా ఏర్పాట్లు