Errabelli on Modi Government : కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించకపోగా… గతంలో ఇచ్చిన వాటిలోనే 500 కోట్లు కోత పెట్టడం ఏమిటని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ మండిపడ్డారు. గ్రామ పంచాయతీల అభివృద్ధికిచ్చే నిధులను ఇవ్వకపోతే సర్పంచ్‌లకు తాము ఏం సమాధానం చెప్పుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రగతిపథంలో ముందుకెళ్తుందని అవార్డులు ఇస్తున్న కేంద్రం.. ఇలా నిధుల్లో కోత పెట్టి అభివృద్ధికి ఆటంక పరచడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.
వరంగల్ కలెక్టరెట్‌లో కరోనా చర్యలు, యాసంగి ధాన్యం కొనుగోలు, పాలకుర్తి పర్యాటక పనుల పురోగతిపై జిల్లా అధికారులతో మంత్రి సమీక్షా సమవేశం నిర్వహించారు. రాష్ట్రానికి అవార్డులు రావడానికి సహకరించిన ప్రజాప్రతినిధులు, అధికారులకు మంత్రి అభినందనలు తెలిపారు. గత బడ్జెట్‌లో 1,845 కోట్లు కేటాయిస్తే… మిగతా అయిదు వందల కోట్ల మాటేమిటని ఆయన కేంద్రాన్ని ఈ సందర్భంగా నిలదీశారు.
ఇంకేమైనా అదనంగా ఇస్తారని ఆశిస్తే, ఇవ్వాల్సినవి ఇవ్వకుండా కొరవి పెడితే గ్రామాలకు ఏవిధంగా కేటాయించి అభివృద్ధి చేసుకోవాలని ఆయన ప్రశ్నించారు. అటు, జిల్లా, మండల పరిషత్ లకు కూడా ఒక్క రూపాయి ఇవ్వరు.. ఇచ్చే జిపిలకు కూడా తగ్గిస్తే ఎలా అని ఎర్రబెల్లి మండిపడ్డారు.
Read also : Vijayashanthi : నాపై అక్రమ కేసులు పెట్టి, భయాందోళనకు గురి చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు : విజయశాంతి