Rashtriya Sanskriti Mahotsav: జాతీయ సంస్కృతి మహోత్సవాలకు ముస్తాబైన ఓరుగల్లు..  ముఖ్య అతిథిగా ఎవరు రానున్నారంటే..

|

Mar 29, 2022 | 7:22 AM

Rashtriya Sanskriti Mahotsav: ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను పురస్కరించుకుని.. దేశ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటేలా కేంద్రం జాతీయ సంస్కృతి మహోత్సవాలను వేడుకగా నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే.

Rashtriya Sanskriti Mahotsav: జాతీయ సంస్కృతి మహోత్సవాలకు ముస్తాబైన ఓరుగల్లు..  ముఖ్య అతిథిగా ఎవరు రానున్నారంటే..
Rashtriya Sanskriti Mahotsa
Follow us on

Rashtriya Sanskriti Mahotsav: ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను పురస్కరించుకుని.. దేశ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటేలా కేంద్రం జాతీయ సంస్కృతి మహోత్సవాలను వేడుకగా నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో తొలిసారి ఈ వేడుకలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఈనెల 26, 27 తేదీల్లో ఏపీలోని రాజమండ్రిలో అత్యంత వేడుకగా సంస్కృతి మహోత్సవాలు జరిగాయి. ఇప్పుడు తెలంగాణలోని చారిత్రక వరంగల్‌ నగరం ఈ ఉత్సవాలకు ముస్తాబైంది. హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో మొత్తం రెండు రోజుల పాటు అంటే ఈరోజు (మార్చి 29), రేపు (మార్చి30) ఈ ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఓరుగల్లు చారిత్రక నగరి వైభవాన్ని తెలియచేసేలా.. అంగరంగ వైభవంగా ఉత్సవ వేదికలను ఏర్పాటుచేశారు. ఇక నగర ప్రజలకు ఆహ్వానం పలుకుతూ జరిగిన శోభాయాత్ర కనుల పండువగా సాగింది. చారిత్రక వేయిస్తంభాల గుడి నుంచి…అదాలత్ వరకు నిర్వహించిన ఈ యాత్రలో..కళాకారులు బతుకమ్మ పాటలు, ఆటలు, కోలాటాలు వేస్తూ హంగామా చేశారు.

తర్వాత హైదరాబాద్‌లోనే..
సంస్కృతి మహోత్సవాల్లో భాగంగా వివిధ రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లను ప్రతిబించించేలా.. 80కి పైగా స్టాళ్లను సిద్ధం చేశారు. అదేవిధంగా వివిధ రాష్ట్రాల కళాకారులు.. తమ ప్రదర్శనలతో అలరించనున్నారు. తొలిరోజు కార్యక్రమాలకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హాజరుకానున్నారు. ఇక బుధవారం జరిగే ముగింపు వేడుకల్లో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి పాల్గొననున్నారు. ప్రదర్శనలు ఉచితమని.. నగరవాసులంతా సాంస్కృతిక మహోత్సవంలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు. కాగా వరంగల్‌లో ఉత్సవాలు ముగిసిన అనంతరం మూడురోజులపాటు అంటే మార్చి 1, 2, 3 తేదీల్లో హైదరాబాద్‌ వేదికగా ఈ ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి.

Also Read:Viral Video: సూపర్‌మ్యాన్ శుభ్‌మాన్.. ఇలాంటి క్యాచ్ నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్..!

Taliban Beard Rules: గడ్డం తీసేస్తే ఉద్యోగం నుంచి తీసేస్తారు.. ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త రూల్స్..

Viral Video: నడిరోడ్డుపై నానా యాగీ చేసిన కుక్క.. ‘బద్దక రత్న’ అవార్డ్ ఇచ్చేయొచ్చు.. వీడియో చూసి ఎంజాయ్ చేయండి..!