Viral Video: నడిరోడ్డుపై నానా యాగీ చేసిన కుక్క.. ‘బద్దక రత్న’ అవార్డ్ ఇచ్చేయొచ్చు.. వీడియో చూసి ఎంజాయ్ చేయండి..!

Viral Video: కుక్క పేరు ప్రస్తావిస్తే.. విశ్వాసానికి మారుపేరు, ప్రేమకు ప్రతిరూపం అని చెబుతుంటారు. పెంపుడు కుక్కలు తమ యజమాని పట్ల ఎనలేని ప్రేమాభినాలు చూపుతాయి. వారి పట్ల విధేయత కనబరుస్తాయి.

Viral Video: నడిరోడ్డుపై నానా యాగీ చేసిన కుక్క.. ‘బద్దక రత్న’ అవార్డ్ ఇచ్చేయొచ్చు.. వీడియో చూసి ఎంజాయ్ చేయండి..!
Dog
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 29, 2022 | 7:00 AM

Viral Video: కుక్క పేరు ప్రస్తావిస్తే.. విశ్వాసానికి మారుపేరు, ప్రేమకు ప్రతిరూపం అని చెబుతుంటారు. పెంపుడు కుక్కలు తమ యజమాని పట్ల ఎనలేని ప్రేమాభినాలు చూపుతాయి. వారి పట్ల విధేయత కనబరుస్తాయి. వారు ఏం చెబితే అది చేసిపెడతాయి. వారితో గేమ్స్ ఆడుతాయి, సరదాగా పోట్లాడుతాయి.. వారి ప్రతి చర్యలో పాల్గొని ఔరా అనిపిస్తాయి. కానీ, కొన్ని కుక్కులు ఉంటాయి.. బాబోయ్ ఇదేంట్రా ఇలా తయారైంది అని విసుగు తెప్పిస్తాయి. వాటికి కోపం వచ్చినా కష్టమే.. అలక వచ్చినా కష్టమే. వాటికి నచ్చని పని చేసినా కష్టమే అన్నట్లు ఉంటుంది ఆ కుక్కల వ్యవహారం. ఇంకొన్ని కుక్కలైతే.. బద్దకంగా వ్యవహరిస్తాయి. తాజాగా ఇలాంటి కోవకే చెందిన ఓ కుక్కకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ కుక్క ప్రవర్తించిన తీరు నవ్వు తెప్పిస్తోంది. ఈ వీడియోను చూసి నెటిజన్లు ఫుల్లుగా నవ్వుకుంటున్నారు.

ఇంతకీ ఆ వీడియోలో ఏముందో ఒకసారి లుక్కేద్దాం.. కొంతమంది వ్యక్తులు తాము ఎక్కిడికి వెళ్లినా తమ వెంట తమ పెంపుడు జంతువులను తీసుకెళ్తుంటారు. మరీ ముఖ్యంగా పెంపుడు కుక్కల గురించి ఎక్కువగా చెప్పుకోవచ్చు. తాజాగా ఓ అమ్మాయి కూడా తన పెంపుడు కుక్కను సరదాగా బయటకు తీసుకెళ్లింది. మొదట బాగానే ఫాలో అయిన కుక్క.. మధ్యలోకి వెళ్లగానే ఏమైందో ఏమో ఒక్కసారిగా మొండికేసింది. ముందుకు కదలనంటే కదలనంటూ మారాం చేసింది. ఆ యువతి పాపం కుక్కను ముందుకు తీసుకెళ్లేందుకు నానా తంటాలు పడింది. అయినా కనుకరించని కుక్క.. కాళ్లపై పడుకుంది. ఇక చేసేది లేక ఆ యువతి కుక్కను బలవంతంగా లాక్కెళ్లే ప్రయత్నం చేసింది. అయితే, ఈ సీన్‌ను పక్కనే ఉన్నవారు తమ కెమెరాలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. కుక్క చేసిన అల్లరికి నెటిజన్లు అంతా కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. ఇదేం కుక్క రా బాబూ మరీ ఇంత బద్దకిస్తుంది అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్ చేయగా.. ఇప్పటి వరకు 17 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. వందలాది మంది లైక్స్ కొడుతున్నారు.

Also read:

PM – MP Marriage: ఎంపీతో పెళ్లికి సిద్ధమైన మాజీ ప్రధాని.. ఏజ్ గ్యాప్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!

Home Loan Tips: హోమ్ లోన్ అప్లికేషన్ ప్రతిసారి రిజెక్ట్ అవుతుందా? ఇలా చేస్తే లోన్ పక్కా..!

Viral Photo: ఈ ఫోటోలో అందమైన అమ్మాయి దోబూచులాడుతోంది.. ఆమె ఎక్కడుందో మీరు కనిపెట్టగలరా?..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!