AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: సూపర్‌మ్యాన్ శుభ్‌మాన్.. ఇలాంటి క్యాచ్ నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్..!

GTvLSG - IPL 2022: IPL 2022 నాలుగో మ్యాచ్‌లో కొత్త జట్లు అయిన లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్(GT vs LSG) హోరా హోరీగా తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోని గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది.

Viral Video: సూపర్‌మ్యాన్ శుభ్‌మాన్.. ఇలాంటి క్యాచ్ నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్..!
Shubman Gill
Shiva Prajapati
|

Updated on: Mar 29, 2022 | 7:16 AM

Share

GTvLSG – IPL 2022: IPL 2022 నాలుగో మ్యాచ్‌లో కొత్త జట్లు అయిన లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్(GT vs LSG) హోరా హోరీగా తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోని గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్‌కు శుభారంభం లభించలేదు. కేవలం 29 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. టైటాన్స్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ఆరంభంలోనే 3 వికెట్లు పడగొట్టి జట్టుపై ఆధిపత్యం ప్రదర్శించాడు. మరోవైపు వరుణ్ ఆరోన్ కూడా ఒక వికెట్ తీశాడు. శుభ్‌మన్ గిల్ అద్భుత క్యాచ్ పట్టడంతో ఈ వికెట్ పడింది.

మ్యాచ్ నాలుగో ఓవర్లో ఎవిన్ లూయిస్ స్క్వేర్ లెగ్ కొట్టాడు. స్కైస్‌లోకి విసిరిన బంతిని పట్టుకోవడానికి గిల్ తిరిగి పరుగెత్తాడు. అద్భుతమైన డైవింగ్ చేసి బంతిని క్యాచ్ అందుకున్నాడు. ఆ క్యాచ్ చూసి అందరూ స్టన్ అయిపోయారు. గిల్ అద్భుతమైన క్యాచ్‌కు ఫిదా అయిపోయారు. కామెంటేటర్స్ గిల్ డైవ్‌ను పెద్ద చర్చే పెట్టారు. అద్భుతమైన డైవ్ అంటూ కితాబిచ్చారు. కాగా, గిల్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అతని డైవ్, సూపర్ మెన్‌లా రన్నింగ్ చేసి బంతిని క్యాచ్ పట్టడంపై క్రికెట్ ప్రేమికులు వావ్ అంటున్నారు. గిల్‌పై ప్రశంసలజల్లు కురిపిస్తున్నారు. మరెందుకు ఆలస్యం.. ఈ అద్భుతమైన స్టంట్‌ను మీరూ చూసేయండి.

లక్నో పేలవ ప్రదర్శన.. గుజరాత్ బంపర్ విజయం.. ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్‌ పేలవమైన ప్రదర్శన కనబరిచింది. ఇన్నింగ్స్ తొలి డెలివరీలోనే కెప్టెన్ కేఎల్ రాహుల్ షమీకి వికెట్ ఇచ్చాడు. షమ్మీ క్వింటన్ డి కాక్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. లూయిస్ 10 పరుగుల వద్ద ఔటయ్యాడు. మనీష్ పాండే 6 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ దశలో దీపక్ హుడా, ఆయుష్ బదోనీ ఆకట్టుకునే హాఫ్ సెంచరీతో మెరిశారు. దీపక్ హుడా (55), ఆయుష్ బదోని (54) రాణించడంతో లక్నో సూపర్ జెయింట్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఆ తరువాత 159 పరుగుల లక్ష్యంగా బరిలోకి దిగిన గుజరాత్.. తొలుత తడబాటుకు గురైనా ఆ తరువాత పుంజుకుని గెలుపు తీరానికి చేరారు. నిర్ణీత ఓవర్లకు 2 బంతులు మిగిలి ఉండగానే.. నిర్దేశిత పరుగుల లక్ష్యాన్ని చేధించి ఘన విజయం సాధించారు.

Also read:

Viral Photo: ఈ ఫోటోలో అందమైన అమ్మాయి దోబూచులాడుతోంది.. ఆమె ఎక్కడుందో మీరు కనిపెట్టగలరా?..

PM – MP Marriage: ఎంపీతో పెళ్లికి సిద్ధమైన మాజీ ప్రధాని.. ఏజ్ గ్యాప్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!

Home Loan Tips: హోమ్ లోన్ అప్లికేషన్ ప్రతిసారి రిజెక్ట్ అవుతుందా? ఇలా చేస్తే లోన్ పక్కా..!