Gujarat Titans vs Lucknow Super Giants, IPL 2022: హోరాహోరీ పోరులో లక్నో సూపర్ జెయింట్స్‌ను చిత్తు చేసిన గుజరాత్ టైటాన్స్..
Gujarat Titans vs Lucknow Super Giants, IPL 2022: ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2022 లీగ్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించింది.
Gujarat Titans vs Lucknow Super Giants, IPL 2022: ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2022 లీగ్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించింది. నిర్ణీత ఓవర్లలో లక్నో టీమ్ నిర్ధేశించిన 158 పరుగుల లక్ష్యాన్ని చేధించింది. ఐపీఎల్‌లో కొత్త జట్లు అయిన లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన హోరా పోరు సాగింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 158 పరగులు చేసింది. హుడా (55), ఆయుష్ బదానీ (54) అద్భుత ఇన్నింగ్స్‌తో స్వల్ప స్కోర్ నుంచి పోరాడే స్కోర్ వరకు చేర్చారు. దీంతో గుజరాత్ టైటాన్స్ టీం ముందు 159 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. షమీ బౌలింగ్‌లో సంచలనం సృష్టించి4 ఓవర్లలో 3 వికెట్లు పడగొట్టాడు.
ఇక 159 పరుగలు లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్.. తొలుత తడబాటుకు గురై 2 వికెట్లు సమర్పించుకున్నా.. ఆ తరువాత కుదురుకుంది. మాథ్యూ వాడే(30), హార్దిక్ పాండ్య(33) ఇద్దరూ కలిసి జట్టుకు మంచి స్కోర్ అందించారు. ఆ తరువాత వచ్చిన డేవిడ్ మిల్లర్(30), రాహుల్(40)* అద్భుతంగా రాణించారు. కీలక సమయంలో మిల్లర్ అవుట్ అయినా.. రాహుల్ ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. తనకు తోడుగా వచ్చిన అభినవ్ మనోహర్(15)తో కలిసి జట్టును రెండు బంతులు మిగిలి ఉండగానే విజయతీరాలకు చేర్చారు.
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): శుభమన్ గిల్, మాథ్యూ వేడ్(కీపర్), విజయ్ శంకర్, అభినవ్ మనోహర్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, లాకీ ఫెర్గూసన్, వరుణ్ ఆరోన్, మహమ్మద్ షమీ
లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (కీపర్), ఎవిన్ లూయిస్, మనీష్ పాండే, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, మొహ్సిన్ ఖాన్, ఆయుష్ బదోని, దుష్మంత చమీర, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్
Also read:
Andhra Pradesh: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ప్రశంసలు కురిపించిన నోబెల్ గ్రహీత ఎస్తేర్ డుఫ్లో..
Home Loan Tips: హోమ్ లోన్ అప్లికేషన్ ప్రతిసారి రిజెక్ట్ అవుతుందా? ఇలా చేస్తే లోన్ పక్కా..!
PM – MP Marriage: ఎంపీతో పెళ్లికి సిద్ధమైన మాజీ ప్రధాని.. ఏజ్ గ్యాప్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!