Glenn Maxwell Marriage: పెళ్ళంటే ఇదీ..ఆస్ట్రేలియా మాక్స్‌వెల్.. చెన్నై విని రామన్.. ఐపీఎల్‌ను మించి.. వైరల్ వీడియో..
గ్లెన్ మాక్స్‌వెల్ గత వారం ఆస్ట్రేలియాలో విని రామన్‌ను వివాహం చేసుకున్నాడు. ఒక వారం తరువాత చెన్నైలో భారతీయ సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్(Glenn Maxwell) 2017 నుంచి డేటింగ్ చేస్తున్న తన చిరకాల స్నేహితురాలు విని రామన్(Glenn Maxwell Vini Raman Marriage )ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. గత వారం ఆస్ట్రేలియాలో ఆమెను క్రిస్టియన్ పద్ధతిలో వివాహం ఆడగా, ఈసారి సాంప్రదాయ భారతీయ పద్ధతిలో చెన్నైలో మరోసారి వివాహం చేసుకున్నారు. కాగా, మాక్స్‌వెల్, విన్నీల వివాహ వీడియో ఎంతో ఫన్నీగా ఉంది. మ్యాక్స్‌వెల్ పెళ్లికి క్రికెటర్ల నుంచి ఐపీఎల్ టీమ్‌ల వరకు అందరూ శుభాకాంక్షలు తెలిపారు. హర్భజన్ సింగ్ మాక్స్‌వెల్ జీవితం కొత్త ప్రారంభానికి గుడ్ లక్ చెప్పాడు. అదే సమయంలో మాక్స్‌వెల్ పెళ్లి ఫొటోలు కూడా చెన్నై సూపర్ కింగ్స్ ట్విట్టర్ ఖాతా నుంచి షేర్ చేశారు.
మాక్స్‌వెల్ డిప్రెషన్‌తో పోరాడుతున్నప్పుడు ఈ ఇద్దరి మధ్య సంబంధం చాలా దృఢంగా మారింది. ప్రపంచకప్‌లో డిప్రెషన్‌తో పోరాడుతున్నానని, ఆ తర్వాత క్రికెట్‌కు విరామం తీసుకున్నానని మ్యాక్స్‌వెల్ చెప్పిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని మ్యాక్స్‌వెల్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. మాక్స్‌వెల్ కోలుకున్నాక, అతను క్రికెట్ మైదానంలో బలమైన పునరాగమనం చేశాడు. బిగ్ బాష్ నుంచి IPL 2021 వరకు, ఈ ఆటగాడు వేగంగా బ్యాటింగ్ చేయడం ద్వారా అందరి హృదయాలను గెలుచుకున్నాడు.
మ్యాక్స్‌వెల్ తన వివాహం కారణంగా పాకిస్తాన్‌లో పర్యటించకూడదని నిర్ణయించుకున్నాడు. ఈ ఆలస్యంతో IPL 2021లో అతను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో చేరనున్నాడు. మాక్స్‌వెల్ తన తొలి మ్యాచ్‌లో ఓడిపోయినందున బెంగళూరు జట్టు అతని కోసం ఎంతో ఉత్సాహంతో ఎదురుచూస్తుంది. ఆదివారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో బెంగళూరు జట్టు ఓడిపోయింది. 205 పరుగులు చేసినప్పటికీ ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
మ్యాక్స్‌వెల్ 2021లో గేమ్ ఛేంజర్‌గా మారే ఛాన్స్..
ఐపీఎల్ 2021లో గ్లెన్ మాక్స్‌వెల్ 15 మ్యాచ్‌ల్లో 42.75 సగటుతో 513 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ కూడా 144 కంటే ఎక్కువగా ఉంది. ప్రస్తుతం RCBతో ఏబీ డివిలియర్స్ లేడు. అతను రిటైర్డ్ అయ్యాడు. కాబట్టి బెంగళూరు అభిమానులు మాక్స్‌వెల్ వీలైనంత త్వరగా జట్టులోకి రావాలని కోరుకుంటున్నారు.
Glenn Maxwell Malai Mattral ? pic.twitter.com/Nu3ikToVRi
— Tinku | ಟಿಂಕು (@tweets_tinku) March 27, 2022
Glenn Maxwell at his wedding ? #maxwell #rcb pic.twitter.com/hjuK6CsQFQ
— We Know Cricket – Cricket Memes (@weknowcricket) March 28, 2022
Have the most amazing week you two! ?#StarsFamily
? @Gmaxi_32 pic.twitter.com/kswVjioPyX
— Melbourne Stars (@StarsBBL) March 22, 2022
Also Read: GT vs LSG Live Score, IPL 2022: హాఫ్ సెంచరీతో కీలక ఇన్నింగ్స్ ఆడుతోన్న దీపక్ హుడా.. స్కోరెంతంటే?