Gujarat Titans vs Lucknow Super Giants Highlights: లక్నో సూపర్ జెయింట్స్‌ను చిత్తు చేసిన గుజరాత్ టైటాన్స్.. ఘన విజయం నమోదు..
Gujarat Titans vs Lucknow Super Giants Highlights:
Gujarat Titans vs Lucknow Super Giants, IPL 2022: ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ 2022 లీగ్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించింది. నిర్ణీత ఓవర్లలో లక్నో టీమ్ నిర్ధేశించిన 158 పరుగుల లక్ష్యాన్ని చేధించింది. ఐపీఎల్‌లో కొత్త జట్లు అయిన లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన హోరా పోరు సాగిందిలా.
టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 158 పరగులు చేసింది. హుడా (55), ఆయుష్ బదానీ (54) అద్భుత ఇన్నింగ్స్‌తో స్వల్ప స్కోర్ నుంచి పోరాడే స్కోర్ వరకు చేర్చారు. దీంతో గుజరాత్ టైటాన్స్ టీం ముందు 159 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. షమీ బౌలింగ్‌లో సంచలనం సృష్టించి4 ఓవర్లలో 3 వికెట్లు పడగొట్టాడు.
ఇక 159 పరుగలు లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్.. తొలుత తడబాటుకు గురై 2 వికెట్లు సమర్పించుకున్నా.. ఆ తరువాత కుదురుకుంది. మాథ్యూ వాడే(30), హార్దిక్ పాండ్య(33) ఇద్దరూ కలిసి జట్టుకు మంచి స్కోర్ అందించారు. ఆ తరువాత వచ్చిన డేవిడ్ మిల్లర్(30), రాహుల్(40)* అద్భుతంగా రాణించారు. కీలక సమయంలో మిల్లర్ అవుట్ అయినా.. రాహుల్ ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. తనకు తోడుగా వచ్చిన అభినవ్ మనోహర్(15)తో కలిసి జట్టును రెండు బంతులు మిగిలి ఉండగానే విజయతీరాలకు చేర్చారు.
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): శుభమన్ గిల్, మాథ్యూ వేడ్(కీపర్), విజయ్ శంకర్, అభినవ్ మనోహర్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, లాకీ ఫెర్గూసన్, వరుణ్ ఆరోన్, మహమ్మద్ షమీ
లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (కీపర్), ఎవిన్ లూయిస్, మనీష్ పాండే, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, మొహ్సిన్ ఖాన్, ఆయుష్ బదోని, దుష్మంత చమీర, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్
Key Events
నేడు లక్నో సూపర్‌జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు IPLలో తమ మొదటి మ్యాచ్‌లో తలపడనున్నాయి.
ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి గుజరాత్‌కు కెప్టెన్ హార్దిక్ పాండ్యాపైనే నిలిచింది. ఇంతకు ముందు ఐపీఎల్‌లో పాండ్యా కెప్టెన్సీ చేయలేదు.
LIVE Cricket Score & Updates
-
హోరాహోరీ పోరులో ఘన విజయం సాధించిన గుజరాత్ టైటాన్స్..
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2022 లీగ్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించింది. నిర్ణీత ఓవర్లలో లక్నో టీమ్ నిర్ధేశించిన 158 పరుగుల లక్ష్యాన్ని చేధించింది.
-
ఐదో వికెట్ కోల్పోయిన గుజరాత్ టైటాన్స్.. జట్టు స్కోర్ 143/5..
గుజరాత్ టైటాన్స్ వికెట్స్ కోల్పోతున్నా విజయం దిశగా దూసుకెళ్తుంది. తాజాగా టీమ్ 5వ వికెట్ కోల్పోయింది. మిల్లర్ క్యాచ్ అవుట్ అయ్యాడు. జట్టు స్కోర్ 143/5 గా ఉంది.
-
-
నాలుగో వికెట్ కోల్పోయిన గుజరాత్ టైటాన్స్.. జట్టు స్కోర్ 102/4..
మాంచి ఊపుమీదున్న గుజరాత్ టైటాన్స్ బ్యాట్స్‌మెన్‌కు హుడా రూపంలో గట్టి ఝలక్ తగిలింది. 11వ ఓవర్‌లో హుడా వేసిన బౌలింగ్‌లో మాథ్యూ వాడే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజ్‌లో రాహుల్ తెవాటియా, డేవిడ్ మిల్లర్ ఉన్నారు. జట్టు స్కోర్ 102/4
-
మూడో వికెట్ కోల్పోయిన గుజరాత్ టైటాన్స్.. జట్టు స్కోర్ 72/3..
గుజరాత్ టైటాన్స్ 3వ వికెట్ కోల్పోయింది. క్రునాల్ పాండ్య బౌలింగ్‌లో హార్దిక్ పాండ్య క్యాచ్ ఔట్ అయ్యాడు. 10 ఓవర్లు ముగిసే సమయానికి గుజరాత్ టైటాన్స్ స్కోర్ 72/3.
-
దూకుడు పెంచిన గుజరాత్ టైటాన్స్.. 8 ఓవర్లకు స్కోర్ 64/2..
ఆదిలో తడబడిన గుజరాత్ టైటాన్స్ బ్యాట్స్‌మెన్.. ఆ తరువాత కుదురుకున్నారు. బ్యాటింగ్‌లో దూకుడు ప్రదర్శిస్తున్నారు. 30 పరుగుల వద్ద 2 వికెట్లు కోల్పోయిన గుజరాత్ టైటాన్స్.. ఆ తరువాత పట్టు సాధించింది. క్రీజ్‌లో మాథ్యూ వాడే, హార్ధిక్ పాండ్య ఉన్నారు. 9 ఓవర్లు ముగిసే సమయానికి గుజరాత్ టైటాన్స్ స్కోర్ 64/2 గా ఉంది.
-
-
4 ఓవర్లకు గుజరాత్ టైటాన్స్ స్కోర్ 35/2..
159 పరుగుల లక్ష్యంలో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ ఆదిలోనే తడబాటుకు గురైంది. మ్యాచ్ ప్రారంభమైన కాసేపటికే 2 వికెట్లు కోల్పోయింది. 4 ఓవర్లు పూర్తయ్యే సమయానికి గుజరాత్ జట్టు స్కోర్.. 35/2 గా ఉంది.
-
గుజరాత్ టార్గెట్ 159
ఐపీఎల్‌లో రెండు కొత్త జట్లు లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ ఈరోజు తమ తొలి మ్యాచ్‌లో తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ టీం నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 158 పరగులు చేసింది. హుడా (55), ఆయుష్ బదానీ (54) అద్భుత ఇన్నింగ్స్‌తో స్వల్ప స్కోర్ నుంచి పోరాడే స్కోర్ వరకు చేర్చారు. దీంతో గుజరాత్ టైటాన్స్ టీం ముందు 159 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. ఈ మ్యాచ్ వాంఖడే స్టేడియంలో జరుగుతోంది. టాస్ హార్దిక్‌కు అదృష్టంగా మారింది. షమీ బౌలింగ్‌లో సంచలనం సృష్టించి 4 ఓవర్లలో 3 వికెట్లు పడగొట్టాడు.
-
ఐదో వికెట్ డౌన్..
హాఫ్ సెంచరీతో కీలక ఇన్నింగ్స్ ఆడిన దీపక్ హుడా ఎల్బీగా పెవిలియన్ చేరాడు. దీంతో లక్నో సూపర్ జెయింట్స్ టీం మరోసారి కష్టాల్లో కూరకపోయింది. ప్రస్తుతం లక్నో టీం 16 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది.
-
15 ఓవర్లకు స్కోరెంతంటే..
15 ఓవర్లు ముగిసే సరికి లక్నో టీం 4 వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది. దీపక్ హుడా 55, బదొని 28 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
-
10 ఓవర్లకు స్కోరెంతంటే..
10 ఓవర్లు ముగిసే సరికి లక్నో టీం 4 వికెట్లు కోల్పోయి 47 పరుగులు చేసింది. దీపక్ హుడా 19, బదొని 6 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
-
నాలుగో వికెట్ డౌన్..
లక్నో సూపర్ జెయింట్స్‌కు ఈ మ్యాచ్ ఏమాత్రం కలిసొచ్చేలా లేదు. వరుసగా వికెట్లు కోల్పోతూ పీకల్లోతూ కష్టాల్లో కూరకపోయింది. షమీ తన బౌలింగ్‌తో లక్నో బ్యాటర్లకు చుక్కలు చూపిస్తు్న్నాడు. షమీ తన మూడు ఓవర్లలో మూడు వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం లక్నో టీం 5 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 29 పరుగులు చేసింది.
-
మూడో వికెట్ డౌన్..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో టీంకు తొలి బంతి నుంచే షాకుల మీద షాకులు తగులుతున్నాయి. షమీ తన బౌలింగ్‌లో రెండు కీలక వికెట్లు పడగొట్టగా, 3.3 ఓవర్‌లో వరుణ్ ఆరోన్ బౌలింగ్‌లో లివీస్ భారీ షాట్‌కు ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం లక్నో టీం 3.3 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 20 పరుగులు చేసింది.
-
రెండో వికెట్ డౌన్..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో టీంకు తొలి బంతి నుంచే షాకుల మీద షాకులు తగులుతున్నాయి. షమీ బౌలింగ్‌లో సత్తా చాటుతూ వరుస వికెట్లు పడగొడుతున్నాడు. ఇన్నింగ్స్ మొదటి ఓవర్ మొదటి బంతికే కేఎల్ రాహుల్ వికెట్ పడగొట్టగా, మూడో ఓవర్‌లో మూడో బంతికి డికాక్‌ను పెవిలియన్ చేరాడు. దీంతో లక్నో టీం రెండు కీలక వికెట్లను కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో కూరకపోయింది. ప్రస్తుతం లక్నో టీం 3 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 14 పరుగులు చేసింది.
-
తొలి బంతికే రాహుల్ ఔట్..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో టీంకు తొలి బంతికే షాక్ తగిలింది. షమీ వేసిన మొదటి బంతికే కేఎల్ రాహుల్ పెవిలియన్ చేరాడు.
-
లక్నో సూపర్ జెయింట్స్ జట్టు
లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (కీపర్), ఎవిన్ లూయిస్, మనీష్ పాండే, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, మొహ్సిన్ ఖాన్, ఆయుష్ బదోని, దుష్మంత చమీర, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్
-
గుజరాత్ టైటాన్స్ జట్టు
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): శుభమన్ గిల్, మాథ్యూ వేడ్(కీపర్), విజయ్ శంకర్, అభినవ్ మనోహర్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, లాకీ ఫెర్గూసన్, వరుణ్ ఆరోన్, మహమ్మద్ షమీ
-
బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తోన్న హార్దిక్ పాండ్యా..
తొలిసారి ఐపీఎల్‌లో కెప్టెన్‌గా బరిలోకి దిగనున్న హార్దిక్ పాండ్యా, బౌలింగ్ చేస్తాడా లేదా అనేది ఆసక్తిగా మారింది. అయితే, మ్యాచ్‌కు ముందు బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. మరి అసలు మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తాడా లేదా అనేది చూడాలి.
-
తలపడనున్న అన్నదమ్ములు..
ఈ మ్యాచ్‌లో ఇద్దరు అన్నదమ్ములు పోటీపడడం చూడొచ్చు. గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సోదరుడు కృనాల్ పాండ్యా లక్నో జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఈ ఇద్దరు ఆటగాళ్లు ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ తరపున ఆడేవారు. కానీ, ముంబై టీం వీరిని రిటైన్ చేసుకోలేదు. మెగా వేలంలో ఇద్దరూ వేర్వేరు జట్లలో ఆడుతున్నారు.
-
అందరి చూపు హార్దిక్ పైనే..
ఈ మ్యాచ్‌లో అందరి చూపు లక్నో సారథి హార్దిక్ పాండ్యాపైనే నిలిచింది. తొలిసారి ఐపీఎల్‌లో కెప్టెన్‌గా బరిలోకి దిగనున్నాడు. అలానే బౌలింగ్ చేస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. తన ఫిట్‌నెస్ సమస్యలతో చాలాకాలంగా వార్తల్లో నిలుస్తున్నాడు. దీంతో ఈ మ్యాచ్‌లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు.
Published On - Mar 28,2022 6:38 PM