KTR vs Piyush Goyal : ‘మా సంగతేంటి సారూ’.. రైల్వే మంత్రి పీయూష్ గోయల్ వీడియోకి మంత్రి కేటీఆర్ రియాక్షన్

|

Mar 22, 2021 | 7:00 PM

KTR vs Piyush Goyal : మా సంగతేంటి మహాప్రభో.. అంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్.. భారత రైల్వే మంత్రి పీయుష్ గోయల్‌ని ప్రశ్నించారు. ..

KTR vs Piyush Goyal : మా సంగతేంటి సారూ..  రైల్వే మంత్రి పీయూష్ గోయల్ వీడియోకి మంత్రి కేటీఆర్ రియాక్షన్
Ktr Vs Piyush
Follow us on

KTR vs Piyush Goyal : మా సంగతేంటి మహాప్రభో.. అంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్.. భారత రైల్వే మంత్రి పీయుష్ గోయల్‌ని ప్రశ్నించారు. “ప్రియమైన పీయూష్ జీ, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో తెలంగాణ ప్రజలకు వాగ్దానం చేసిన వరంగల్ రైల్ కోచ్ ఫ్యాక్టరీపై ఏమైనా అప్డేట్ ఉందా..? అంటూ రైల్వే మంత్రిని అడిగారు కేటీఆర్. అంతేకాదు, వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం భారత ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఇప్పటికే 150 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం అప్పగించిందని గుర్తు చేస్తూ.. కేటీఆర్ రైల్వే మంత్రికి రీట్వీట్ చేశారు.

అసలు విషయం ఏంటంటే.. మహారాష్ట్ర లాతూర్‌లోని మరాఠ్వాడ రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఆధునిక, పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను సృష్టించడం ద్వారా ఈ ప్రాంత అభివృద్ధిలో గేమ్ ఛేంజర్‌గా మారింది. 350 ఎకరాల భూమిలో 625 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ కర్మాగారం సంవత్సరానికి 250 బోగీలను ఉత్పత్తి చేయగలదు. అంటూ రైల్వే మంత్రి సదరు ఫ్యాక్టరీ వీడియో ఉంచి మరీ ట్వీట్ చేశారు. దీంతో అదే ట్వీట్ కు మంత్రి కేటీఆర్.. మా సంగతేంటని రిప్లై ఇచ్చారు.