వరంగల్ రూరల్ జిల్లాలో అంతుచిక్కని వింత వ్యాధి పశువుల ప్రాణాలు మింగేస్తుంది. గేదెలు, దుక్కిటేద్దులను బలి తీసుకుంటుంది. పక్షం రోజుల వ్యవధిలో రెండు దుక్కిటేద్దులు, 20 గేదెలు మృతి చెందాయి. వాటికి ఏదో వింతవ్యాధి సోకి ఉంటుందని గ్రామస్థులు ఆందోళన చెందుతుంటే… రేబీస్ వ్యాధి వల్లే మరణాలు సంభవిస్తున్నాయని వెటర్నరీ వైద్యులు చెబుతున్నారు.
ఇది వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ మండలం సూరిపెల్లి గ్రామంలోనీ పశువుల పరిస్థితి. ఇలా పశువులు ఉన్నట్టుండి చనిపోతున్నాయి. ఇప్పటి వరకు 22 పశువులు చనిపోగా, వాటిలో పంట చేనులో నాలుగు పశువులు మృతి చెందాయి. అప్పటివరకు కళ్ళముందు ఆరోగ్యంగా ఉన్న గేదేలు మృతి చెందడంతో రైతులు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కొత్త రోగం ఏమైనా సోకిందోమోనన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. మృతి చెందిన పశువుల మెదడును పరీక్షల నిమిత్తం బొంబాయికి పంపించారు. రిజల్ట్ రావాల్సి ఉంది. రేబీస్ వ్యాధి తోనే పశువులు మృతి చెందాయని వెటర్నరీ వైద్యురాలు మమతా చెబుతున్నారు. ఈ వ్యాధి రాకుండా జాగ్రత్తపడాలనీ, దీనికీ మందు లేదని, అజాగ్రత్త వహిస్తే మనుషులకు కూడ సోకుతుందని చెబుతున్నారు. ఇప్పటికే ఆ గ్రామంలో హెల్త్ క్యాంప్ నిర్వహించామని, మళ్ళీ మరో హెల్త్ క్యాంప్ ను కూడ నిర్వహిస్తామని మమతా తెలిపారు. రైతులకు కూడ యాంటీ రాబీస్ వ్యాక్సిన్ ఇచ్చామని ఆమె తెలిపారు.
Also Read: 73 ఏళ్ల వృద్ధ మహిళ వరుడు కావాలంటూ ప్రకటన.. ముందుకొచ్చిన 69 ఏళ్ల వ్యక్తి..!
ఎస్‌బీఐ ఏటీఎం సెంటర్‌లో అగ్నిప్రమాదం.. బాంబుల మాదిరిగా పేలిన ఏటీఎం మిషన్లు.. వీడియో