Seethakka : ఫారెస్ట్ అధికారులకు ఎమ్మెల్యే సీతక్క వార్నింగ్.. పోడు భూముల జోలికొస్తే..

|

Jul 20, 2021 | 5:47 PM

మహిళల పట్ల అసభ్యతా..? తరిమికొడతారు జాగ్రత్త, రైతులకు అన్యాయమా..? కత్తులు.. గొడ్డళ్లతో దాడులు చేస్తారు ఖబడ్దార్.. అంటూ ఇవాళ సంచలన కామెంట్స్ చేశారు ములుగు ఎమ్మెల్యే సీతక్క...

Seethakka : ఫారెస్ట్ అధికారులకు ఎమ్మెల్యే సీతక్క వార్నింగ్.. పోడు భూముల జోలికొస్తే..
Seethakka
Follow us on

Seethakka – Kottaguda Forest Officer – Srinivas Reddy : మహిళల పట్ల అసభ్యతా..? తరిమికొడతారు జాగ్రత్త, రైతులకు అన్యాయమా..? కత్తులు.. గొడ్డళ్లతో దాడులు చేస్తారు ఖబడ్దార్.. అంటూ ఇవాళ సంచలన కామెంట్స్ చేశారు ములుగు ఎమ్మెల్యే సీతక్క. మహబూబాబాద్ జిల్లా గంగారం, కొత్తగూడ, గూడురు మండలాల్లో సీతక్క ఇవాళ పోడు భరోసా యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె అధికారులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొందరు ఫారెస్ట్ అధికారులపై సీతక్క మండిపడ్డారు.

కొత్తగూడ డిప్యూటీ రేంజ్ అధికారి శ్రీనివాసరెడ్డి.. గిరిజన మహిళలపై తెగబడ్డం ఏం సంస్కారమని నిలదీశారామె. తన గదిలో పది నిమిషాలు కళ్లు మూసుకుంటే పోడుకు పర్మిషన్ ఇస్తానంటారా..? అని సీతక్క తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిసే తరిమి కొడతారు… రైతులకు అన్యాయం జరిగితే కత్తులు, గొడ్డళ్లతో దాడులు చేస్తారు జాగ్రత్తగా ఉండండి అని ఆమె హెచ్చరించారు.

Seetakka Podu Bharosa

ఇలా ఉండగా, పోడు చిచ్చుతో పచ్చటి గిరిజన పల్లెల్లో నెత్తురు చిందుతోంది. అటవీ శాఖాధికారులు – ప్రజాప్రతి నిధుల మధ్య యుద్ధ వాతావరణానికి వేదికగా మారింది. వృత్తి ధర్మమని అటవీశాఖ సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటే – దిక్కుతోచని పోడు రైతులు తిరగబడుతున్నారు. పోడు వివాదం రణరంగంగా మారుతుండడంతో పోలీసులు తుపాకులు ఎక్కుపెడుతున్నా రు. బక్క చిక్కిన పోడు రైతులపై బలప్రదర్శన చేస్తున్నారు. వెరసి.. పోడు రైతుల పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారింది. ఏళ్ల తరబడి వ్యవసాయం సాగు చేసుకుంటున్న పోడు రైతులకు ఒక వైపు రెవెన్యూ అధికారులు పట్టాలు జారీచేశారు. మరోవైపు ఆ భూములను స్వాధీనం చేసుకునేందుకు అటవీశాఖ సిబ్బంది వృత్తి ధర్మం పేరుతో వీరంగం సృష్టిస్తున్నారు.

వరంగల్ ఉమ్మడి జిల్లా ఏజెన్సీలో రోజుకోచోట పోడు వివాదం రణరంగంగా మారుతోంది. పోడు రైతుల తిరుగుబాటుతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి పలువురు అడవిబిడ్డలు ఈ ఘర్షణల్లో గాయపడుతున్నారు. కాగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుమారు 1లక్ష 9వేల ఎకరాల్లో పోడు భూములున్నాయని అటవీశాఖ అధికారులు అంచనా. వాటిని స్వాధీన పర్చుకునేందుకు అటవీ అధికారులు చేయని ప్రయత్నాలు లేవు. ఈ భూములు నిత్యం రణరంగంగా మారుతున్నాయి. రైతుల భూములలో కందకం తీస్తే కబర్దార్ అని ఓ ఎమ్మెల్యే వార్నింగ్ ఇస్తే.. మరో ఎమ్మెల్యే రైతుల కోసం జైలుకైనా వెళ్తానని హెచ్చరించడం అక్కడి పరిస్థితులకు దర్పణంగా మారింది.

Read also: ‘ఈటల నన్ను చంపించబోయారు.. బాల్‌రాజ్‌ను 2014లో హత్య చేయించారు.. ఆయనకు నరనరానా ఓసీ ఫీలింగ్ ఉంది’ : పాడి కౌశిక్ రెడ్డి