KTR Birthday : వరంగల్‌లో వెరైటీగా కేటీఆర్ బర్త్ డే, స్పెషల్ సాంగ్ రిలీజ్ చేసిన ఎర్రబెల్లి, నన్నపునేని

తెలంగాణ ఐటీ, పురపాలకశాఖ మంత్రి KTR జన్మదిన వేడుకలు వరంగల్‌లో వెరైటీగా నిర్వహించారు...

KTR Birthday : వరంగల్‌లో వెరైటీగా కేటీఆర్ బర్త్ డే, స్పెషల్ సాంగ్ రిలీజ్ చేసిన ఎర్రబెల్లి, నన్నపునేని
Warangal Ktr Birthday

Updated on: Jul 24, 2021 | 7:05 AM

KTR Birthday – Warangal : తెలంగాణ ఐటీ, పురపాలకశాఖ మంత్రి KTR జన్మదిన వేడుకలు వరంగల్‌లో వెరైటీగా నిర్వహించారు. వరంగల్ తూర్పు MLA నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో KTR చిత్రపటాన్ని గ్రీన్ ఆర్ట్ ద్వారా ప్రదర్శించి అబ్బుర పర్చారు. ఖిలా వరంగల్ లో ఏర్పాటు కేటీఆర్ గ్రీన్ ఆర్ట్ తోపాటు, బర్త్ డే సాంగ్‌ను మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఆవిష్కరించారు.

కేక్ కట్ చేసి నిన్న.. అంటే కేటీఆర్ పుట్టినరోజుకు ఒకరోజు ముందే జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు వరంగల్ తూర్పు నియోజకవర్గం పరిధిలోని ఖిలా వరంగల్ లో జరిగాయి. కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు చరిత్రలో నిలిచిపోయే విధంగా ఆయనకు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అపురూప కనుక అందించారు.

వర్షంలోనే ఈ వేడుకలు నిర్వహించారు. గ్రీన్ ఆర్ట్ కళాకారులు గడ్డితో రూపుదిద్దిన కేటీఆర్ చిత్రపటంతో పాటు, బర్త్ డే సాంగ్ ను జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఆవిష్కరించారు. KTR బర్త్ డే సందర్భంగా ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటాలని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పిలుపు నిచ్చారు. ముక్కోటి వృక్షఅర్చనలో ప్రజలంతా భాగస్వామ్యం కావలని ఎర్రబెల్లి అన్నారు.

జులై 24 కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా  కదిలే.. కదిలే అంటూ ఒక పాట విడుదలైంది. ఈ పాటను ఎంపీ సంతోష్ కుమార్ చేతుల మీదుగా ఆవిష్కరించారు దర్శక రచయితలు. కాగా, ఇవాళ (24 07 2021) కేటీఆర్ బర్త్ డే పురస్కరించుకుని అనేక మంది కేటీఆర్ అభిమానులు, టీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు, తమకు తోచిన రీతిలో సమాజానికి ఉపయోగపడేరీతిన బర్త్ డే వేడుకలు నిర్వహిస్తుండటం విశేషం.

Read also : Sonu Sood : సోనూసూద్ ఆక్సిజన్ ప్లాంట్‌ను మంత్రి గౌతమ్ రెడ్డితో కలిసి ప్రారంభించిన దివ్యాంగురాలు నాగలక్ష్మి