MGM Hospital: ఎంజీఎం ఆస్పత్రిలో దారుణం.. ఆగిన విద్యుత్ సరఫరా.. ఊపిరాడక ప్రాణాలు కోల్పోయిన పేషెంట్..

|

Mar 21, 2021 | 11:22 AM

MGM Hospital: వరంగల్‌లో దారుణం వెలుగు చూసింది. ఎంజీఎం ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణం బలైపోయింది.

MGM Hospital: ఎంజీఎం ఆస్పత్రిలో దారుణం.. ఆగిన విద్యుత్ సరఫరా.. ఊపిరాడక ప్రాణాలు కోల్పోయిన పేషెంట్..
Mgm Hospital
Follow us on

MGM Hospital: వరంగల్‌లో దారుణం వెలుగు చూసింది. ఎంజీఎం ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణం బలైపోయింది. విద్యుత్ సరఫరాలో అంతరాయంతో పేషెంట్ మృతి చెందాడు. వివరాల్లోకెళితే.. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపురం గ్రామానికి చెందిన గాంధీ అనే వ్యక్తికి కరోనా సోకడంతో 25 రోజుల క్రితం ఎంజీఎం ఆసుపత్రిలో చేరాడు. అతని ఆరోగ్య పరిస్థితి సీరియస్‌గా ఉండడంతో డాక్టర్లు వెంటిలేటర్‌పై ఉంచి వైద్యం అందిస్తున్నారు. ఈ రోజు ఆస్పత్రిలో కరెంట్ పోవడంతో వెంటిలేటర్‌ పనిచేయలేదు. దాంతో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరై గాంధీ ప్రాణాలు కోల్పోయాడు. ప్రతిష్టాత్మక ఎంజీఎం ఆస్పత్రిలో వెంటిలేటర్ పనిచేయకపోవడం కారణంగా కరోనా రోగి మృతి చెందడం తీవ్ర చర్చనీయాంశమైంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విద్యుత్ మరమ్మతు పనుల్లో భాగంగా పవర్ తీసివేయడం జరుగుతుందని అధికారులు.. ఆస్పత్రికి సిబ్బందికి ముందస్తు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై బాధితుడి కుటుంబ సభ్యులు భగ్గుమంటున్నారు.

ఇదిలాఉంటే.. విద్యుత్ సరఫరా అంశంపై వస్తున్న ఆరోపణలు ఎంజీఎం సూపరింటెండెంట్ తోసిపుచ్చారు. అలాంటిదేమీ లేదని, వెంటిలేటర్‌ మార్చే క్రమంలో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగానే క్రిటికల్ పేషెంట్ ప్రాణాలు కోల్పోయాడని చెబుతున్నారు. ఆస్పత్రిలో చేరిన సమయంలోనే గాంధీ పరిస్థితి విషమంగా ఉందని.. ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఈ రోజు కరెంటు పోయిన సమయంలో వేరే వెంటిలేటర్‌‌పైకి మారుస్తుండగా సాంకేతిక సమస్యలు తలెత్తాయన్నారు. ఆ సమయంలోనే గాంధీ ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు తెలిపారు.

Also read:

Trs Party Leaders: స్టేషన్‌ఘన్‌పూర్ టీఆర్ఎస్‌లో తారాస్థాయికి చేరిన విభేదాలు.. ఎమ్మెల్యే రాజయ్యపై సంచలన వ్యాఖ్యలు చేసిన కడియం శ్రీహరి..

Google Pay App FASTag: గూగుల్‌ పేను ఉపయోగించి మీ ఫాస్ట్‌ట్యాగ్‌ను రీఛార్జ్ చేయడం ఎలా..? సులభమైన పద్దతుల్లో.

World Down Syndrome Day 2021 : డౌన్ సిండ్రోమ్ అంటే ఏమిటి? దాని లక్షణాలు ఎలా ఉంటాయి.. ట్రీట్ మెంట్ గురించి తెలుసుకోండిలా..