CM KCR Government Hospital visits : తెలంగాణలో కరోనా బారిన పడిన వారికి మరింత మెరుగైన వైద్యం అందడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శిస్తున్నారు. నిన్న హైదరాబాద్ గాంధీ ఆస్పత్రి సందర్శించి రోగులకు కొండత ధైర్యాన్నిచ్చిన ముఖ్యమంత్రి కేసిఆర్ శుక్రవారం వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిని సందర్శించనున్నట్లు తెలుస్తోంది. బుధవారం హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో కొవిడ్ చికిత్స అందిస్తున్న విధానం, సౌకర్యాలు, బాధితులను ప్రత్యక్షంగా కలుసుకొని వారి యోగక్షేమాలు అడిగి సీఎం కేసీఆర్ తెలుసుకున్న సంగతి తెలిసిందే. మరింత మెరుగైన వైద్యం అందేలా చూడాలని డాక్టర్లకు ఆదేశాలు కూడా జారీ చేశారు కేసీఆర్. మరో వైపు వారు చేస్తున్న సేవను అభినందించారు. అదే క్రమంలో వరంగల్ ఎంజిఎంలో కూడా సందర్శించి, మెరుగైన సౌకర్యాలు, బాధితుల్లో ధైర్యం నింపనున్నారు.
గాంధీ ఆసుపత్రి సందర్శనలో ముఖ్యమంత్రి కేసిఆర్, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు కేవలం మాస్కులు మాత్రమే ధరించి సందర్శించి, కరోనా గురించి మరీ భయం అవసరం లేదన్నది చెప్పకనే చెప్పారు. కాగా, రేపటి ఎంజిఎం ఆస్పత్రి సందర్శనకు సీఎం కేసీఆర్ తో పాటు మంత్రి హరీశ్ కూడా విచ్చేయనున్నట్లు సమాచారం.
Read also : Mahesh babu : హీరో మహేష్ బాబు ఇంటి దగ్గర హై సెక్కూరిటీ.. !