మద్యం మత్తులో రూపాయి అగ్గిపెట్టె కోసం ఓ యువకుడి నిండు నూరేళ్ళ జీవితం బలైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది… అగ్గిపెట్టే కోసం తలెత్తిన గొడవ యువకుడి ప్రాణం బలి తీసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వరంగల్ జిల్లా రాయపర్తి si విజయకుమార్ కథనం ప్రకారం…పర్వతగిరి మండలం అణంతారం గ్రామానికి బేతి రామ్ చరణ్ (18)రాయపర్తి మండలం కోలన్ పెల్లి గ్రామంలోనీ పెద్దమ్మ ఇంటికి సంక్రాంతి పండక్కి వచ్చాడు ..గత సోమవారం రాత్రి పాఠశాల సమీపంలో మద్యం సేవిస్తున్న మిత్రుల సమాచారం మేరకు తాను అక్కడికి వెళ్లాడు.. స్నేహితులతో కలిసి సరదాగా మద్యం సేవించాడు.
ఈ క్రమంలోనే సిగేరెట్ వెలిగించుకోవడం కోసం అంతకు ముందే అక్కడ మద్యం సేవిస్తున్న మరికొంతమంది యువకుల వద్దకు వెళ్లిన రామ్ చరణ్ అగ్గిపెట్టె అడిగాడు. ఈ క్రమంలోనే వారి మద్య వాగ్వాదం తలెత్తింది. పరస్పరం గొడవకు దిగారు..ఇరువురి మధ్య మాట మాట పెరిగి గొడవ కాస్త ఇరువర్గాల గొడవగా మారింది. ఈ అనూహ్య తగాదలో ఇరువర్గాలు ఘర్షణపడ్డారు.. రామ్ చరణ్ తలపై బీరు సీసాతో కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఇంటిదగ్గర ప్రధమ చికిత్స చేయించారు.. వెంటనే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
మెరుగైన చికిత్స కోసం హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ రామ్ చరణ్ గురువారం మృతి చెందాడు. రామ్ చరణ్ మృతితో తన స్వగ్రామమైన పర్వతగిరి మండలం అనంతారం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుని కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..