Warangal RPF Personnel Saves Bihar Man: తొందరపాటులో చేసిన పనులు అప్పుడప్పుడు ప్రాణాల మీదకు వస్తుంటాయి. వరంగల్ (warangal) లో ఓ యువకుడి అలానే తొందరపడ్డాడు. కానీ, రైల్వే పోలీసులు అతని పాలిట దేవుళ్లుగా మారారు. కొన్ని అజాగ్రత్తల కారణంగా రైలు ప్రయాణాల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతుంటారు. రైలు ఎక్కబోయి, దిగబోయి ప్రమాదాలబారిన పడే ప్రయాణికులను రోజూ చూస్తూనే ఉంటాం. కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించినప్పుడు, రన్నింగ్ ట్రైన్‌లో నుంచి దిగే టైంలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఇలాంటి ఘటన ఒకటి వరంగల్ రైల్వే స్టేషన్ (warangal railway station) లో జరిగింది. ఓ ప్రయాణికుడు రన్నింగ్‌లో ఉన్న ట్రైన్ నుంచి దిగేందుకు ప్రయత్నించి కిందపడిపోయాడు. వెంటనే స్పందించిన రైల్వే పోలీసులు (RPF) అతన్ని కాపాడారు. రైల్వే పోలీసుల అప్రమత్తతో ఓ యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. వేగంగా వెళుతున్న ట్రైన్ నుంచి ప్లాట్ ఫాంపై పడిన యువకుడని పట్టాలపై పడే ప్రమాదం నుంచి కాపాడారు పోలీసులు. దీంతో వరంగల్ రైల్వే పోలీసుల్ని అభినందిస్తున్నారు ప్రయాణికులు.
వరంగల్ రైల్వే స్టేషన్లలో కదులుతున్న రైలు నుంచి దిగేందుకు ప్రయత్నించి, అదుపు తప్పి బీహార్‌కు చెందిన యువకుడు పడిపోయాడు. అతడిని ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడారు రైల్వే పోలీసులు. బీహార్‌కు చెందిన ప్రార్థన కుమార్ వరంగల్ నుంచి బీహార్‌కు వెళ్లేందుకు నవజీవన్ ఎక్స్‌ప్రెస్ ఎక్కాలి. కానీ, తెలియక తొందరలో శాతవాహన ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఎక్కాడు. రైలు కదిలిన తర్వాత తాను ఎక్కాల్సిన ట్రైన్ ఇది కాదని తెలుసుకున్న ప్రార్థనకుమార్ దిగడానికి ప్రయత్నించాడు. వేగంగా వెళుతున్న ట్రైన్ నుంచి దూకేశాడు. అదుపు తప్పి ప్లాట్ ఫామ్ పైన పడిపోయాడు.
ఈ క్రమంలో ట్రైన్‌కు, ఫ్లాట్‌ఫామ్ మధ్య పడబోయాడు. అయితే.. సరిగ్గా అక్కడే ఉన్న ఇద్దరు పోలీసులు పట్టాలపై పడబోయే ఆ యువకుడిని చూశారు. వెంటనే స్పందించి పక్కకు లాగడంతో ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు ప్రార్థన కుమార్. తన ప్రాణం కాపాడిన ఆర్పీఎఫ్ పోలీసులకు ప్రార్థనకుమార్ కృతజ్ఞతలు చెప్పాడు.
వీడియో..
Also Read: