BJP Bhim Deeksha: భీం దీక్ష.. టవర్ ఎక్కిన బీజేపీ కార్యకర్త.. వరంగల్ కేయూ వద్ద ఉద్రిక్తత

|

Feb 03, 2022 | 11:43 AM

Telangana BJP Bhim Deeksha: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (CM KCR).. భారత రాజ్యంగం మార్చాలని చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేడు రాష్ట్ర వ్యాప్తంగా భీం దీక్షలు

BJP Bhim Deeksha: భీం దీక్ష.. టవర్ ఎక్కిన బీజేపీ కార్యకర్త.. వరంగల్ కేయూ వద్ద ఉద్రిక్తత
Bjp
Follow us on

Telangana BJP Bhim Deeksha: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (CM KCR).. భారత రాజ్యంగం మార్చాలని చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేడు రాష్ట్ర వ్యాప్తంగా భీం దీక్షలు చేస్తోంది. సీఎం కేసీఆర్ క్షమాపణలు చెప్పాల్సిందేనని.. అప్పటివరకు దశల వారీగా ఆందోళనలు చేపట్టేందుకు బీజేపీ సిద్దమైంది. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ (Bandi Sanjay) కూడా ఈ రోజు ఢిల్లీలో మౌన దీక్ష నిర్వహిస్తున్నారు. బీజేపీ భీమ్ దీక్షలో భాగంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపుతున్నారు. ఈ దీక్షలో బండి సంజయ్‌తో పాటు ఎంపీలు ధర్మపురి అర్వింద్‌, సోయం బాబూరావు, పలువురు కేంద్ర మంత్రులు, తెలంగాణ నాయకులు ఈ దీక్షలో పాల్గొన్నారు.

ఇదిలాఉంటే.. రాష్ట్రంలో అన్ని మండల కేంద్రాల్లో కూడా బీజేపీ భీం దీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో వరంగల్‌లో ఓ కార్యకర్త (BJP activist ) టవర్ ఎక్కడం పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సీఎం కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలి అన్న వ్యాఖ్యలను నిరసిస్తూ కాకతీయ యూనివర్సిటీ జుంక్షన్ వద్ద ఓ బీజేపీ కార్యకర్త టవర్ ఎక్కి ఆందోళన చేపట్టాడు. సీఎం ఆ కామెంట్స్ ఉప సంహరించుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరికలు చేశాడు. ఈ మేరకు సెల్ఫీ వీడియోను విడుదల చేశాడు. కేసీఆర్ ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాడు. దళితులను ముఖ్యమంత్రి చేస్తానని.. చేయలేని వ్యక్తి.. ఇప్పుడు రాజ్యాంగాన్ని మార్చాలంటున్నారంటూ పేర్కొన్నాడు.

Also Read:

Telangana Politics: కేసీఆర్ చేసిన ఒక్క కామెంట్.. బీజేపీ-టీఆర్‌ఎస్‌ నేతల మధ్య మాటల యుద్ధం..!

BJP Bhim Deeksha: నేడు రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ భీం దీక్ష.. ఢిల్లీలో బండి సంజయ్ మౌన దీక్ష..