Hanumakonda Query Accident: తెలంగాణలోని హన్మకొండ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. క్వారీలో ప్రమాదవశాత్తూ టిప్పర్ లారీ బోల్తా పడి ముగ్గురు దుర్మరణం చెందారు. ఈ ఘటన కాజీపేట మండలం తరాలపల్లి శివారులోని గాయత్రి క్వారీలో జరిగింది. క్వారీలో వెళుతున్న టిప్పర్ ప్రమాదవశాత్తూ పని చేస్తున్న వారిపై శనివారం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తికి చెందిన చందు, గూడురు మండలం బొద్దుగొండకు చెందిన ముఖేష్, జార్ఖండ్‌కు చెందిన అఖీమ్ మృతి చెందారు.
క్వరీలో వేగంగా వచ్చిన టిప్పర్.. అదుపుతప్పి పనిచేస్తున్న ముగ్గురిపై పడటంతో ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో ఒకరు మృతిచెందగా.. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారని వెల్లడించారు. మృతదేహాలను ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మడికొండ పోలీసులు తెలిపారు.
Also Read: