అన్న నువ్వు నిజంగానే గోల్డ్.. బురద క్లీన్ చేస్తుండగా కార్మికుడికి దొరికిన బంగారు గాజులు.. ఆ తర్వాత సీన్ ఇదే..

6 లక్షల రూపాయల విలువ ఇచ్చేసే బంగారు గాజులు నడిరోడ్డుపై చెత్తలో దొరికితే ఎవరైనా ఏం చేస్తారు.. పండుగ చేసుకుంటారు.. కానీ వరంగల్ కు చెందిన ఆ మున్సిపల్ కార్మికులు మాత్రం నిజాయితీని చాటుకున్నారు.. వరదల్లో కొట్టుకు వచ్చిన బంగారు గాజులను మున్సిపల్ కమిషనర్ కు అప్పజెప్పి అందరికీ ఆదర్శంగా నిలిచారు.

అన్న నువ్వు నిజంగానే గోల్డ్.. బురద క్లీన్ చేస్తుండగా కార్మికుడికి దొరికిన బంగారు గాజులు.. ఆ తర్వాత సీన్ ఇదే..
Honest Sanitation Worker

Edited By: Shaik Madar Saheb

Updated on: Nov 03, 2025 | 4:15 PM

6 లక్షల రూపాయల విలువ ఇచ్చేసే బంగారు గాజులు నడిరోడ్డుపై చెత్తలో దొరికితే ఎవరైనా ఏం చేస్తారు.. పండుగ చేసుకుంటారు.. కానీ వరంగల్ కు చెందిన ఆ మున్సిపల్ కార్మికులు మాత్రం నిజాయితీని చాటుకున్నారు.. వరదల్లో కొట్టుకు వచ్చిన బంగారు గాజులను మున్సిపల్ కమిషనర్ కు అప్పజెప్పి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఈ సంఘటన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరిగింది. రఘు అనే పారిశుధ్య కార్మికుడు రాంపూర్ – మడికొండ పై మధ్య పారిశుద్ధ పనులు నిర్వహిస్తున్నాడు.. వర్షాలు, వరదల వల్ల సంభవించిన బురద, వ్యర్ధాలను క్లీన్ చేస్తున్నాడు.. ఈ క్రమంలో బంగారు గాజులు దొరికాయి.. వీటి విలువ సుమారు ఆరు లక్షల వరకు ఉంటుంది.

బంగారు గాజులు దొరికిన వెంటనే ఇతను ఎగిరి గంతులు వేయలేదు.. తన నిజాయితీని చాటుకుని వెంటనే ఆ గాజులను తీసుకెళ్లి తన పై అధికారులకు చూపించాడు.. అక్కడినుండి ఆ గాజులను తీసుకెళ్లి GWMC కమిషనర్ చాహత్ బాయ్ పాయ్ కి అప్పజెప్పారు.. కమిషనర్ ఆదేశాల మేరకు సంబంధిత పోలీస్ స్టేషన్ సిబ్బందికి ఆ గాజులను అప్పజెప్పారు. వర్షాలు వరదల సమయంలో ఎవరైనా బంగారు గాజులు పోగొట్టుకున్న వాళ్ళు ఉంటే.. ఆ గాజుల తాలూకు బిల్లు, సరైన వెయిట్ ఆధారాలతో వస్తే తిరిగి ఆ గాజులు అప్పగిస్తామని మున్సిపల్ కమిషనర్, పోలీస్ సిబ్బంది తెలిపారు.

సుమారు 6 లక్షల రూపాయల విలువగల బంగారు గాజులను నిజాయితీగా అప్పజెప్పిన పారిశుద్ధ్య కార్మికుడు రఘును ప్రతి ఒక్కరూ అభినందించారు.. ఆ బంగారు గాజుల వెనుక బాధితుల ఎంతోకష్టం దాగి ఉంటుందని.. అలా ఉచితంగా దొరికినది ఏది ఉంచుకోవద్దని రాజు తన నిజాయితీని ప్రదర్శించాడు.

వీడియో చూడండి..

చిత్తశుద్ధితో చెత్త శుబ్రం చేసేవాడైన తన నిజాయితీని చాటుకోవడం చూసి ప్రతి ఒక్కరూ అతన్ని అభినందించారు.. పోలీసులు, మున్సిపల్ కమిషనర్ తో సహా నగరప్రజలు కూడా ఆయన్ను ప్రశంసించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..