ఏ ఒక్కరినీ వదలం.. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా కేసులు నమోదు చేస్తున్నామన్న వరంగల్‌ సీపీ

|

Feb 03, 2021 | 3:00 PM

అయోధ్య రామ మందిరం నిర్మాణం కోసం చేస్తున్నవిరాళాల సేకరణపై వరంగల్‌ అట్టుడుకిన విషయం తెలిసిందే. డూప్లికేట్‌ బుక్కులు ప్రింట్‌ చేపించి..

ఏ ఒక్కరినీ వదలం.. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా కేసులు నమోదు చేస్తున్నామన్న వరంగల్‌ సీపీ
Follow us on

అయోధ్య రామ మందిరం నిర్మాణం కోసం చేస్తున్నవిరాళాల సేకరణపై వరంగల్‌ అట్టుడుకిన విషయం తెలిసిందే. డూప్లికేట్‌ బుక్కులు ప్రింట్‌ చేపించి, రాముడి పేరిట చందాలు వసూళ్లు చేస్తున్నారన్న ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వ్యాఖ్యలతో ఓరుగల్లులో టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య దాడులు జరిగాయి.

చల్లా ధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడి చేయగా.. బీజేపీ కార్యాలయంపై టీఆర్‌ఎస్‌ శ్రేణులు ప్రతిదాడికి దిగారు. ఈ నేపథ్యంలో వరంగల్‌లో నెలకొన్న ఉద్రిక్తతలు ఇంకా సల్లారనే లేదు. పరస్పర దాడుల ఘటనలో పలువురిపై కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంల్‌ వరంగల్‌ సీపీ స్పందించారు.

దాడులకు పాల్పడిన వారిలో ఏ ఒక్కరిని వదలమన్నారు వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రమోద్‌కుమార్. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఇప్పటి వరకు 4కేసులు నమోదు చేసామన్నారు. పలువురు నిందితుల్ని అరెస్ట్ చేసామన్నారు. ఇక బీజేపీ ఆఫీస్‌పై దాడి చేసిన వాళ్లను అదుపులోకి తీసుకున్నామన్నారు సీపీ. బీజేపీ, టీఆర్‌ఎస్‌ గొడవల్లో ఇంకా విచారణ కొనసాగుతోందన్నారు.

 

వావిలాలలో ఈటల రాజేందర్‌ ఉద్వేగపూరిత ప్రసంగం.. మరోసారి సంచలనంగా మారిన ఈటల వ్యాఖ్యలు