తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ వాటర్ వార్ మొదలైంది. కృష్ణా నదిపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను KRMBకి అప్పగించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకుందన్న హరీష్ రావు వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ పెంచాయి. కేంద్రం నుంచి అలాంటి ప్రతిపాదన వచ్చిందని.. కానీ తాము అందుకు ఒప్పుకోలేదని తెలంగాణ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. దీనిపై అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు.
ప్రభుత్వం వివరణ ఇచ్చినా.. ఈ అంశంపై బీఆర్ఎస్ మాత్రం తన వాదన వినిపిస్తూనే ఉంది. ఉమ్మడి ప్రాజెక్టులను KRMB నిర్వహిస్తే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి. కేంద్రం షరతులకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఒప్పుకున్నదని ఆయన ప్రశ్నించారు.
మరోవైపు ఈ వ్యవహారంలో బీఆర్‌ఎస్‌కు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. గతంలో కృష్ణా నదీ జలాలకు సంబంధించి జరిగిన ఒప్పందంపై కేసీఆర్ సంతకం చేశారని.. అప్పుడు హరీశ్‌రావు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారని బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు.
ఉమ్మడి ప్రాజెక్టులను KRMB నిర్వహిస్తే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి. కేఆర్‌ఎంబీ పరిధిలోకి శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులను తీసుకెళ్లడం సరికాదని సూచించారు. కేంద్ర షరతులకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఒప్పుకున్నదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలను ప్రభుత్వం కేంద్రానికి తాకట్టు పెట్టిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి కేవలం ఆంధ్ర ప్రయోజనాలను నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు నిరంజన్‌రెడ్డి.
ఉమ్మడి ప్రాజెక్టులు నిజంగానే KRMB పరిధిలోకి వెళతాయా లేదా అన్న విషయంలో క్లారిటీ రాకపోయినా.. రాజకీయ పార్టీలు మాత్రం తప్పు మీదంటే మీదే అంటూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..