Telangana Paddy Politics: తెలంగాణలో వరి ధాన్యం సేకరణ రచ్చ.. ఉగాది తరువాత యుద్ధమే అంటున్న రాష్ట్ర సర్కార్..!

|

Mar 28, 2022 | 6:00 AM

Telangana Paddy Politics: వన్‌ నేషన్‌-వన్ ప్రొక్యూర్‌మెంట్..! టీఆర్ఎస్(TRS) కొత్త నినాదమిది. దేశమంతా ఒకే ధాన్యం సేకరణ పద్ధతి ఉండాలి..

Telangana Paddy Politics: తెలంగాణలో వరి ధాన్యం సేకరణ రచ్చ.. ఉగాది తరువాత యుద్ధమే అంటున్న రాష్ట్ర సర్కార్..!
Trs Vs Bjp
Follow us on

Telangana Paddy Politics: వన్‌ నేషన్‌-వన్ ప్రొక్యూర్‌మెంట్..! టీఆర్ఎస్(TRS) కొత్త నినాదమిది. దేశమంతా ఒకే ధాన్యం సేకరణ పద్ధతి ఉండాలి.. తేవాలి అని గులాబీదళం గట్టిగా డిమాండ్ చేస్తోంది. ఉగాది తర్వాత ఇక యుద్ధమే అని ఇప్పటికే ప్రకటించిన ప్రభుత్వం.. ఆ దిశగా కార్యాచరణ ముమ్మరం చేసింది. అటు రాజకీయం కోసం రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారని కౌంటర్ ఇస్తోంది బీజేపీ(BJP). ఇప్పుడు ఈ మ్యాటర్‌లోకి కాంగ్రెస్‌ కూడా ఎంట్రీ ఇచ్చింది.

తెలంగాణ వరి దాన్యం కొనుగోలు అంశం రచ్చ రచ్చగా మారింది. వరి మొత్తం కొనుగోలు చేయాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తుంటే.. ‘‘రా’’ రైస్ ఎంత ఇచ్చినా కొంటామని కేంద్రం చెబుతోంది. వచ్చేది బాయిల్డ్‌ రైస్ అయితే ముడి బియ్యం ఎక్కడి నుంచి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. సరిగ్గా ఇక్కడే ఆగిపోతోంది విషయం. మాటలు తూటాల్లా పేలుతున్నాయే తప్ప అడుగుముందుకు పడటం లేదు. మరో వారం అయితే యాసంగి పంట చేతికి వస్తుంది. మరి రైతుల సంగతి ఏంటి? ధాన్యం ఎవరు కొనాలి.? అనేది ప్రశ్నగా మిగిలింది.

అయితే, ఉగాది తర్వాత తెలంగాణ ఉగ్రరూపం చూస్తారని కేంద్రాన్ని హెచ్చరించింది రాష్ట్ర ప్రభుత్వం. పంజాబ్‌ తరహాలో పండిన ధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేయకపోతే రైతులే బీజేపీకి తలకొరివి పెడతారని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇదిలాఉంటే.. బీజేపీ వాదన మరోలా ఉంది. ఇన్నాళ్లు లేని ఇబ్బంది ఇప్పుడే ఎందుకు వస్తోందన్న లాజిక్‌ను తెరపైకి తెస్తోంది. రైతుల్ని కేంద్రానికి దూరం చేసే కుట్ర ఇదని ఆరోపిస్తోంది. దీనికి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తోంది టీఆర్ఎస్. అసలు మోదీ సర్కారే తెలంగాణ ఈ దేశంలో లేదన్నట్లుగా ప్రవర్తిస్తోందని రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు టీఆర్ఎస్ నేతలు.

ఇక బీజేపీ-టీఆర్ఎస్ మధ్య జరుగుతున్న డైలాగ్‌ వార్‌లోకి కాంగ్రెస్‌ కూడా ఎంట్రీ ఇచ్చింది. రెండు పార్టీలు కలిసి డ్రామాలు ఆడుతున్నాయని విమర్శించింది. మొత్తానికి ఈ ధాన్యం యుద్ధానికి ఇప్పట్లో ఓ పరిష్కారం లభించేలా కనిపించడం లేదు. అటు కేంద్రం, ఇటు రాష్ట్రం ఎవరి వాదన వాళ్లు వినిపిస్తున్నారు. మరి ఉగాది తర్వాత సీఎం కేసీఆర్ ఎలాంటి కార్యాచరణ ప్రకటిస్తారు.? దానికి కేంద్రం రియాక్షన్ ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Also read:

Ugadi 2022: ఉగాది పండుగ ఎప్పుడనే దానిపై తర్జన భర్జన.. మరి పంచాంగకర్తలు ఏం చేశారంటే..!

Viral Photo: ప్రకృతి విసిరిన సవాల్.. ఈ ఫోటోలో ఒక అద్భుతం దాగుంది.. అదేంటో కనిపెట్టగలరా?

Russia Ukraine War: ‘పుతిన్’ కారణంగా పుట్టెడు కష్టాలు ఎదుర్కొంటున్న 198 ఏళ్ల నాటి చెట్టు.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే..!