గుప్త నిధులు ఉన్నాయని నమ్మించి.. సర్వం దోచుకుని నట్టేట ముంచి.. సీన్ కట్ చేస్తే

|

Mar 07, 2022 | 1:11 PM

ప్రపంచం సాంకేతిక వైపు పరుగులు పెడుతున్నా.. కొన్ని ప్రాంతాల్లో మూఢ విశ్వాసాలు రాజ్యమేలుతూనే ఉన్నాయి. విజ్ఞానం ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతూ కొత్త ఆవిష్కరణలు చేస్తున్నా కొందరు మూఢ నమ్మకాలను...

గుప్త నిధులు ఉన్నాయని నమ్మించి.. సర్వం దోచుకుని నట్టేట ముంచి.. సీన్ కట్ చేస్తే
Hidden Funds
Follow us on

ప్రపంచం సాంకేతిక వైపు పరుగులు పెడుతున్నా.. కొన్ని ప్రాంతాల్లో మూఢ విశ్వాసాలు రాజ్యమేలుతూనే ఉన్నాయి. విజ్ఞానం ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతూ కొత్త ఆవిష్కరణలు చేస్తున్నా కొందరు మూఢ నమ్మకాలను వీడడం లేదు. గుప్త నిధులు(Hidden Funds), అదృశ్య శక్తులు, తాంత్రిక క్షుద్ర పూజలు పేరుతో అమాయకులను మోసగిస్తున్నారు. వారి నుంచి అందినకాడికి దోచుకుని పరారవుతున్నారు. తాజాగా కొమురంభీం(Kumram Bhim District) జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. ఇంట్లో బంగారం ఉందని నమ్మించిన ఓ దొంగ స్వామి ముఠా రూ.18లక్షలు దోచుకున్నారు. తాము మోసపోయామని(Cheating) గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తెలంగాణలోని కొమురంభీం జిల్లాలో భారీ మోసం బయటపడింది. వాంకిడి మండలంలోని ఘాట్ జనగాం గ్రామంలో గుప్త నిధుల పేరుతో మోసం వెలుగుచూసింది. చటారి కమాలకర్ అనే వ్యక్తి ఇంట్లో బంగారం ఉందని నమ్మించి రూ.18లక్షలకు పైగా నగదును కాజేశారు. మహారాష్ట్రలోని యావత్మాల్ కు చెందిన ముఠా.. మారువేశంలో కమలాకర్ ఇంటికి వచ్చారు. అతని ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని మాయమాటలు చెప్పారు. వాటిని వెలికితీసేందుకు తమకు కొంత డబ్బును ఇవ్వాల్సి ఉంటుందని నమ్మించారు.

వారి మాటలు నమ్మిన కమలాకర్.. రూ.18.3 లక్షలు ఇచ్చాడు. డబ్బు చేతిలో పడగానే దొంగ ముఠా అక్కడి నుంచి ఉడాయించారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు.. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కమలాకర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యా్ప్తు చేపట్టిన పోలీసులు.. వడాస్కర్ పంజాబ్ రావు అలియాస్ నాసిక్ మహరాజ్ ముఠాను అరెస్టు చేశారు. బంగారం పట్ల జరిగే మోసాల గురించి అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే తమకు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు.

Also Read

DRDO Scholarship 2022: ఏడాదికి రూ.1,86,600ల చొప్పున స్కాలర్‌షిప్‌ అందుకునే అవకాశం.. డోంట్ మిస్‌ ఇట్‌!

FD Rates: ఎఫ్ డి లపై వడ్డీ రేట్లు పెంచిన ఈ మూడు బ్యాంకులు.. ఎంత పెంచాయంటే..

Keerthy Suresh: బుట్టబొమ్మ పూజ హ‌బిబో పాట‌కు మహానటి ఫిదా.. కీర్తిసురేశ్ డ్యాన్స్ వీడియో వైరల్