AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇలా ఉన్నారేంట్రా.. అర్థరాత్రి కాలనీల్లో లవ్ బర్డ్స్ హల్చల్.. వీడియో చూసి

వరంగల్‌ జిల్లాలో ఓ లవ్ స్టోరీ కాస్తా క్రైమ్ స్టోరీగా మారింది. జల్సాల కోసం పెట్రోల్ దొంగతనాలు చేస్తూ ఓ ప్రేమ జంట పోలీసులకు దొరికిపోయింది. హనుమకొండలో ఇళ్ల ముందు పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలే లక్ష్యంగా ఈ జంట సాగిస్తున్న అర్ధరాత్రి పెట్రోల్ లూటీల వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Viral Video: ఇలా ఉన్నారేంట్రా.. అర్థరాత్రి కాలనీల్లో లవ్ బర్డ్స్ హల్చల్.. వీడియో చూసి
Hanamkonda Crime News (1)
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Jun 02, 2026 | 9:00 AM

Share

పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యులకే కాదు.. జల్సాలకు అలవాటు పడ్డ ఆకతాయిలకు కూడా పెద్ద సమస్యగా మారినట్లుంది. అయితే సాధారణంగా ఆకతాయిలు ఒంటరిగానో, స్నేహితులతో కలిసో పెట్రోల్ చోరీలకు పాల్పడడం చూస్తుంటాం. కానీ, ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఓ యువతి, యువకుడు కలిసి బైక్‌లపై తిరుగుతూ అర్ధరాత్రి వేళల్లో పెట్రోల్ చోరీలకు తెగబడుతున్న ఉదంతం వరంగల్ నగరంలో తీవ్ర కలకలం రేపుతోంది. సీసీ కెమెరాలో రికార్డైన ఈ ప్రేమ జంట నిర్వాకం చూసి స్థానికులు, పోలీసులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. హనుమకొండ పరిధిలోని 56వ డివిజన్‌లో గత కొన్ని రోజులుగా స్థానికులకు ఒక వింత సమస్య ఎదురవుతోంది. రాత్రి వేళల్లో ఇళ్ల ముందు, రోడ్లపై పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాల నుంచి పొద్దున లేచేసరికి పెట్రోల్ మాయమైపోతోంది. వరుసగా ఇలా బైక్‌లలో పెట్రోల్ లూటీ అవుతుండడంతో వాహనదారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక, కంటిమీద కునుకు లేకుండా కాపలా కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

సీసీ కెమెరా విజువల్స్ చూసి షాక్!

అయితే ఈ పెట్రోల్ ఎందుకు మాయం అవుతుందని తెలుసుకునేందుకు కాలనీవాసులు తమ ఇళ్లకు ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా అందులోని దృశ్యాలు చూసి వారంతా ఒక్కసారిగా షాకయ్యారు. అందులో అర్ధరాత్రి వేళ ఓ యువతి, యువకుడు బైక్‌పై కాలనీలో తిరుగుతూ కనిపించారు. బైక్‌పై ఉన్న ఆమ్మాయి ఎవరైనా వస్తున్నారా లేదా అని చుట్టుపక్కల నిఘా పెడుతుంది. అదే సమయంలో యువకుడు బైక్ దిగి, ఇళ్ల ముందు పార్క్ చేసిన వాహనాల వద్దకు వెళ్తాడు. తన వెంట తెచ్చుకున్న ఖాళీ బాటిళ్లలోకి బైక్ ట్యాంకుల నుంచి పెట్రోల్‌ను గుట్టుచప్పుడు కాకుండా నింపేశాడు. పని పూర్తవ్వగానే ఇద్దరూ కలిసి అక్కడి నుంచి పారిపోయారు.

ఇదంతా చూసిన కాలనీవాసులకు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టడా రోడ్లపై పార్క్ చేసిన బైక్‌లనే టార్గెట్ చేస్తూ ఈ జంట చోరీలకు పాల్పడుతున్నట్లు తేలింది. దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించేందుకు పోలీసులు గాలింపు చేపట్టారు. త్వరలోనే ఈ ‘పెట్రోల్’ జంటను పట్టుకుంటామని అధికారులు ధీమా వ్యక్తం చేశారు.

ఇదిగో వీడియో..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
2027 వన్డే ప్రపంచకప్‌కు కౌంట్‌డౌన్.. షెడ్యూల్ ప్రకటించిన ఐసీసీ
2027 వన్డే ప్రపంచకప్‌కు కౌంట్‌డౌన్.. షెడ్యూల్ ప్రకటించిన ఐసీసీ
వాట్సప్‌ వాడేవారికి అదిరిపోయే సూపర్ న్యూస్
వాట్సప్‌ వాడేవారికి అదిరిపోయే సూపర్ న్యూస్
GATE 2027 రిజిస్ట్రేషన్ చేయాలంటే DigiLocker తెరవాల్సిందే..!
GATE 2027 రిజిస్ట్రేషన్ చేయాలంటే DigiLocker తెరవాల్సిందే..!
ఈసారి అలాంటి పప్పులుడకవ్..కంటెస్టెంట్లకు నాగ్ స్ట్రాంగ్ వార్నింగ్
ఈసారి అలాంటి పప్పులుడకవ్..కంటెస్టెంట్లకు నాగ్ స్ట్రాంగ్ వార్నింగ్
బోనాల ప్రత్యేకం: తెలంగాణ ప్రజల ఇలవేల్పు మైసిగండి మైసమ్మ ఆలయం..
బోనాల ప్రత్యేకం: తెలంగాణ ప్రజల ఇలవేల్పు మైసిగండి మైసమ్మ ఆలయం..
కదులుతున్న రైలు నుంచి దూకేసిన ప్రయాణికులు.. ఏం జరిగిందో తెలుసా!
కదులుతున్న రైలు నుంచి దూకేసిన ప్రయాణికులు.. ఏం జరిగిందో తెలుసా!
తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలెర్ట్..ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వాన
తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలెర్ట్..ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వాన
త్రిషపై.. ఉదయనిధి షాకింగ్‌ కామెంట్స్‌.. తమిళనాడులో పెను దుమారం!
త్రిషపై.. ఉదయనిధి షాకింగ్‌ కామెంట్స్‌.. తమిళనాడులో పెను దుమారం!
రాహువు కటాక్షం..ఆ రాశుల వారికి కొత్త శుభ యోగాలు!
రాహువు కటాక్షం..ఆ రాశుల వారికి కొత్త శుభ యోగాలు!
నీట్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. కేసుల రద్దుకు గ్రీన్ సిగ్నల్
నీట్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. కేసుల రద్దుకు గ్రీన్ సిగ్నల్