Vikarabad District: కారు గల్లంతు ఘటనలో డ్రైవర్‌ ఆచూకీ లభ్యం.. వరదలో చెట్టు కొమ్మ చిక్కడంతో

|

Aug 30, 2021 | 7:32 PM

వికారాబాద్ జిల్లా తిమ్మాపూర్ లో గల్లంతైన కారు ఘటనలో.. డ్రైవర్ రాఘవేందర్ ఆచూకీ లభ్యమైంది. చనిపోయాడనుకున్న డ్రైవర్ సేఫ్ గానే ఉన్నాడు. అయితే వాగులో కాదు...

Vikarabad District: కారు గల్లంతు ఘటనలో డ్రైవర్‌ ఆచూకీ లభ్యం.. వరదలో చెట్టు కొమ్మ చిక్కడంతో
Marpally Car Accident
Follow us on

వికారాబాద్ జిల్లా తిమ్మాపూర్ లో గల్లంతైన కారు ఘటనలో.. డ్రైవర్ రాఘవేందర్ ఆచూకీ లభ్యమైంది. చనిపోయాడనుకున్న డ్రైవర్ సేఫ్ గానే ఉన్నాడు. అయితే వాగులో కాదు.. ఇంట్లో. వాగులో కొట్టుకుపోయాడని అధికారులు గాలిస్తుంటే.. ఆయన మాత్రం ఇంట్లో తీరికగా ఉన్నాడు. సంఘటన జరిగి గంటలు గడుస్తున్నా.. రాఘవేందర్ బంధువులు వాగు దగ్గరికి రాలేదు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఇంటికెళ్లి.. అదుపులోకి తీసుకున్నారు. కారు గల్లంతైన తర్వాత.. వరదలో చెట్టుకొమ్మను పట్టుకుని డ్రైవర్‌ రాఘవేందర్‌ బయటపడినట్లు పోలీసులు గుర్తించారు. ఈత కొట్టుకుంటూ బయటకు వచ్చినట్టుగా తెలుస్తోంది. మిగిలిన వారిని కనీసం కాపాడే ప్రయత్నం చేయకుండా.. అక్కడ నుంచి వెళ్లిపోయాడు రాఘవేంద్ర. ఉదయం 5 గంటలకు ఇంటికి చేరుకున్నాడు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఘటన జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ ఘటనలవో నవవధువు మృత దేహం లభ్యమైంది. ఆమె మృతదేహాన్ని.. వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మోసుకొచ్చారు. 4 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి SP నారాయణతో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ప్రవళిక మృతదేహాన్ని ట్రాక్టర్ వద్దకు చేర్చటానికి.. స్వయంగా ఎమ్మెల్యే మోసుకుంటూ ఒడ్డుకు చేర్చారు. అలాగే తప్పిపోయిన వారి కోసం విస్తృతంగా గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. గల్లంతైన మరో చిన్నారి ఆచూకి తెలియాల్సి ఉంది.

మర్పల్లి మండలం రావులపల్లి గ్రామానికి చెందిన నవాజ్ రెడ్డి, మోమిన్ పేట్ కు చెందిన ప్రవళికకు ఈ నెల 26న వివాహం జరిగింది. ఆదివారం సాయంత్రం మోమిన్ పేట్ నుండి రావులపల్లి తిరిగి వెళ్తుండగా భారీ వర్షంతో రావులపల్లి – తిమ్మాపూర్ మధ్యలో ఉన్న వాగులో కారు కొట్టుకు పోవడం జరిగింది.

Also Read: మేనత్తతో ప్రేమాయణం.. గర్భవతిని చేసిన వైనం.. ఆపై ఊహించని విషాదం

Ganji: అయ్యో..! అన్నం ఉడికిన తర్వాత గంజి పారబోస్తున్నారా..? పెద్ద తప్పే చేస్తున్నారు