Watch Video: అర్ధరాత్రి తోపుడు బండ్లపై చీప్‎గా ఏంటి ఆ పని.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..

దొంగతనానికి కాదేది అనర్హం అన్నట్టు దొంగలు ఈ మధ్య వెరైటీగా చేతివాటం చూపుతున్నారు. చడ్డి గ్యాంగ్ మాదిరి ఇప్పుడు ముసుగులు వేసుకొని అర్థ రాత్రులు వెరైటీ దొంగతనాలు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో గత కొద్ది రోజులుగా రోడ్ల పక్కన ఉన్న తోపుడు బండ్లపై పండ్లు మాయం అవుతున్నాయి.

Watch Video: అర్ధరాత్రి తోపుడు బండ్లపై చీప్‎గా ఏంటి ఆ పని.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..
Viral Video

Edited By: Srikar T

Updated on: Mar 24, 2024 | 11:31 AM

దొంగతనానికి కాదేది అనర్హం అన్నట్టు దొంగలు ఈ మధ్య వెరైటీగా చేతివాటం చూపుతున్నారు. చడ్డి గ్యాంగ్ మాదిరి ఇప్పుడు ముసుగులు వేసుకొని అర్థ రాత్రులు వెరైటీ దొంగతనాలు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో గత కొద్ది రోజులుగా రోడ్ల పక్కన ఉన్న తోపుడు బండ్లపై పండ్లు మాయం అవుతున్నాయి. ఉదయం వచ్చి చూసే సరికి అరటి పండ్లు మాయం అవుతున్నాయి. తోపుడు బండిపై అరటి పండ్లు అమ్ముకొని జీవనం సాగించే చిరు వ్యాపారులకు ఏమి జరగుతుందో తెలియక తల పట్టుకుంటున్నారు. తరచూ ఇలా జరుగుతుంటే అనుమానం వచ్చిన చీపు సతీష్ అనే వీధి వ్యాపారస్తుడు తన తోపుడు బండి పై పండ్లు మాయం అవుతున్నాయని గమనించి సీసీ కెమెరా అమర్చాడు.

తన తోపుడు బండిపై దాచిన అరటి పండ్లను ఒక ముసుగు దొంగ అర్థరాత్రి వచ్చి దొంగిలించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. దీంతో ప్రతి రోజూ అరటి పండ్లు దొంగతనానికి గురి అవుతున్నాయని తెలుసుకుని షాక్ అయ్యారు. దొంగలు అంటే ఇళ్ళల్లో, షాపుల్లో నగదు ,ఆభరణాలు, విలువైన వస్తువులు దొంగతనం చేయడం చేస్తుంటారు. ఇది తెలిసిన విషయమే. కానీ అర్థ రాత్రి ముసుగు వేసుకొని వచ్చి మరీ ఇంత చీప్‎గా అరటి పండ్లు దొంగతనం చేయడం ఏంటని నోరెళ్ళ బెడుతున్నారు స్థానికులు. సత్తుపల్లిలో మాత్రం ముసుగు దొంగ అర్థ రాత్రుళ్ళు తోపుడు బండ్లుపై పండ్లు ఎత్తుకెళ్తున్నాడు. ఇప్పుడు ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలాంటి దొంగతనాలు అరికట్టాలని పోలీసులను కోరుకుంటున్నారు తోపుడు బండ్ల చిరు వ్యాపారులు.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..