హైదరాబాద్, జూల్09: వంగవీటి మోహన రంగా.. ఆలియస్ రంగా.. ఈ పేరు తెలియని తెలుగువారు ఉండరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తనకంటూ ఓ ప్రత్యేకతను నింపుకోవడమే కాదు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించారని చెప్పొచ్చు. ఉమ్మడి ఏపీలో ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యేగా పనిచేసిన రంగా అటు ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు ఇటు తెలంగాణలో పెద్ద ఎత్తున అభిమానులను సృష్టంచుకున్నారు. అందుకే.. ఆయన చనిపోయి 35 ఏళ్ళు గడచినా ఇప్పటికీ రంగా పేరు ఏపీలోనే కాదు తెలంగాణలో కూడా మారుమోగుతూనే ఉంది. ముఖ్యంగా.. ఎన్నికల వేళ ఆయన పేరు తలచుకుంటూ రాజకీయ పార్టీలు రంగాను తమ వాడిగా చెప్పుకునేందుకు ప్రయత్నిస్తుంటాయి.
అందుకే ఇప్పుడు తాజాగా హైదరాబాద్‌లో ఆయన భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గాజులరామారంలో వంగవీటి రంగా 10 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. రంగా విగ్రహాన్ని ఆయన తనయుడు వంగవీటి రాధాకృష్ణ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కుత్బూల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే కూనం శ్రీశైలం గౌడ్ సహా పలువురు నేతలు, రంగా మిత్రమండలి సభ్యులు పాల్గొన్నారు. హైదరాబాద్ లో రంగా విగ్రహం ఏర్పాటు ఎంతో ఆనందన్నించిందని.. తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి వంగవీటి రంగా అని ఆయన తనయుడు వంగవీటి రాధా సంతోషాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రం విడిపోయినా అభిమానానికి అడ్డుకట్ట లేదని తెలంగాణవాసులు నిరూపించారన్నారని అన్నారు.
రంగా విగ్రహావిష్కరణకు హాజరైన ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీవీ9తో ఆయన మాడుతూ.. 1989లో వంగవీటి రంగా ముఖ్యమంత్రి కావాల్సిన వ్యక్తి అని.. ఆయనను కుట్రతో 1988లో హత్య చేశారని తోట అన్నారు. మూడున్నర దశాబ్దాలు గడిచినా రంగాను హత్య చేసిన వాళ్లు స్వేచ్ఛగా తిరుగుతున్నారని ఆరోపించారు. పెద్ద పెద్ద పదవులు అనుభవిస్తూ.. మళ్లీ కాపులను మోసం చేసి వాళ్ల ఓట్ల కోసం గాలం వేస్తున్నారంటూ తోట చంద్రశేఖర్ ఆరోపించారు. రంగా హత్య కేసును రీఓపెన్ చేయాలంటూ ఏపీ ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. రంగా హంతకులకు సరైన శిక్ష పడినప్పుడే రంగా ఇచ్చే ఘన నివాళని తోట పేర్కొన్నారు.
మరన్ని తెలంగాణ వార్తల కోసం