Bandi Sanjay: మానవత్వం చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్.. లారీ కింద చిక్కుకున్న మహిళను చూసి.. వీడియో

హుటాహుటిన లారీ వద్దకు వెళ్లిన కేంద్రమంత్రి బండి సంజయ్.. దివ్యశ్రీని చూసిన చలించిపోయారు.. భయపడొద్దు...ధైర్యంగా ఉండాలని సూచించారు. అటువైపు వెళుతున్న లారీలను ఆపి జాకీలు, కత్తెర తెప్పించిన బండి సంజయ్.. ప్రాణాలతో విలవిల్లాడుతున్న మహిళను కాపాడేందుకు కృషిచేశారు.

Bandi Sanjay: మానవత్వం చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్.. లారీ కింద చిక్కుకున్న మహిళను చూసి.. వీడియో
Bandi Sanjay

Updated on: Nov 11, 2024 | 1:46 PM

కేంద్రమంత్రి బండి సంజయ్‌ మానవత్వం చాటుకున్నారు. లారీ కింద ఇరుక్కున్న మహిళకు కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ సాయం చేయడంతోపాటు.. వైద్య ఖర్చులు ఇస్తానని హామీనిచ్చారు.. అటుగా వెళ్తున్న బండి సంజయ్.. లారీ కింద చిక్కుకున్న మహిళను చూసి చలించిపోయారు. వెంటనే కాన్వాయ్ ను ఆపి.. అటువైపు వెళ్తున్న లారీలను ఆపి జాకీలు తెప్పించి మహిళను రక్షించారు. అసలేం జరిగిందంటే.. హుజురాబాద్ మండలం సింగపూర్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.. మానకొండూరు మండలం ఖెల్లడ గ్రామానికి చెందిన దివ్యశ్రీ అనే మహిళ లారీ కింద చిక్కుకుంది.. కేకలు వేయడంతో హుజూరాబాద్ సమీపంలోని సింగాపూర్ శివారులో కొద్దిదూరం వెళ్లాక లారీని ఆపేశాడు డ్రైవర్.. అయితే.. లారీ టైర్ కింద జుట్టు ఇరుక్కోవడంతో ఆ మహిళ సాయం కోసం ఆర్తనాదాలు చేసింది.. ఈ క్రమంలో అటుగా ములుగు వెళ్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్.. మహిళను చూసి ఘటన స్థలం వద్ద ఆగారు.

వీడియో చూడండి..

హుటాహుటిన లారీ వద్దకు వెళ్లిన కేంద్రమంత్రి బండి సంజయ్.. దివ్యశ్రీని చూసిన చలించిపోయారు.. భయపడొద్దు…ధైర్యంగా ఉండాలని సూచించారు. అటువైపు వెళుతున్న లారీలను ఆపి జాకీలు, కత్తెర తెప్పించిన బండి సంజయ్.. ప్రాణాలతో విలవిల్లాడుతున్న మహిళను కాపాడేందుకు కృషిచేశారు. కేంద్ర మంత్రి సూచనతో జుట్టు కత్తిరించి మహిళ ప్రాణాలను కాపాడిన స్థానికులు.. వెంటనే కరీంనగర్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి పంపించారు. దివ్యశ్రీ చికిత్సకు అయ్యే ఖర్చును తానే చెల్లిస్తానని ఆసుపత్రి వైద్యులకు సంజయ్ చెప్పారు.. ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..