Amit Shah Tour: నేడు భాగ్యనగరానికి రానున్న అమిత్ షా.. మునుగోడు సమరభేరీలో పాల్గొననున్న హోమ్ మంత్రి.. ఏర్పాట్లు పూర్తి

|

Aug 21, 2022 | 6:47 AM

వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, రామగుండం, ఖమ్మం బీజేపీ కార్యకర్తలతో భేటీ కానున్నారు. అనంతరం సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దర్శనం చేసుకుని పూజాకార్యక్రమాలు నిర్వహించనున్నారు

Amit Shah Tour:  నేడు భాగ్యనగరానికి రానున్న అమిత్ షా.. మునుగోడు సమరభేరీలో పాల్గొననున్న హోమ్ మంత్రి.. ఏర్పాట్లు పూర్తి
Amith Sha
Follow us on

Amit Shah Tour: ‘మునుగోడు సమరభేరి’గా పేరు పెట్టింది బీజేపీ. అమిత్ షా మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ కు చేరుకోనున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రానున్నారు. అక్కడి నుంచి రక్షణ శాఖకు చెందిన ప్రత్యేక హెలికాఫ్టర్ లో బయలుదేరి 4 గంటల 50 నిమిషాల నుంచి 6 గంటల వరకు మునుగోడులో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు అమిత్ షా.

వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, రామగుండం, ఖమ్మం బీజేపీ కార్యకర్తలతో భేటీ కానున్నారు. అనంతరం సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దర్శనం చేసుకుని పూజాకార్యక్రమాలు నిర్వహించనున్నారు. సభామూర్తినగర్ లో దళిత కార్యకర్త సత్యనారాయణతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 3. 20 గంటలకు మనోహర్ హోటల్ కు చేరుకొని అక్కడ సాయంత్రం 4 గంటల వరకు రైతు నేతలతో సమావేశం కానున్నారు.  సాయంత్రం 4. 10 గంటలకు బేగంపేట విమానశ్రయం చేరుకొని 4. 30 గంటలకు ప్రత్యేక హెలికాఫ్టర్ ద్వారా మునుగోడుకు అమిత్ షా పయనం కానున్నారు. 4. 40 నుంచి 4. 55 గంటల వరకూ సీఆర్పీఎఫ్ అధికారులతో సమీక్షసమావేశాన్ని నిర్వహించనున్నారు.
సాయంత్రం 5 గంటలకు మునుగుడో సమరభేరి సభకు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు.

ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆయన అనుచరులు అమిత్ షా సమక్షంలో బీజేపీలో జాయిన్ అవుతారు. అనంతరం సాయంత్రం 6:45 నుంచి 7:30 గంటల వరకు అమిత్ షా రామోజీ ఫిలిం సీటిలో గడపనున్నారు. తర్వాత రాత్రి 8 గంటలకు శంషాబాద్ నోవాటెల్ హోటల్ లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయాలపై చర్చించనున్నారు. బై పోల్ గురించి నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు. రాత్రి 9: 40 గంటలకు అమిత్ షా తిరిగి ఢిల్లీకి బయలుదేరుతారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..